రేపు వచ్చి రూ.1 ఫీజు తీసుకో అన్నారు: ఉద్వేగానికి గురైన లాయర్ హరీష్ సాల్వే

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, సుష్మా మృతిపై స్పందించారు. ఆమె మరణించడానికి గంట ముందే తనతో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పాక్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించి హరీష్ సాల్వే, ఈ […]

రేపు వచ్చి రూ.1 ఫీజు తీసుకో అన్నారు: ఉద్వేగానికి గురైన లాయర్ హరీష్ సాల్వే
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 1:38 PM

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, సుష్మా మృతిపై స్పందించారు. ఆమె మరణించడానికి గంట ముందే తనతో మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

పాక్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించి హరీష్ సాల్వే, ఈ కేసు గెలిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో వాదించడానికి ఆయన కేవలం రూ.1 ఫీజును మాత్రమే ఛార్జ్ చేశారు. ఈ స్వల్ఫ మొత్తాన్ని తీసుకునేందుకు రేపు రావాలంటూ సుష్మా తనకు ఫోన్ చేశారని హరీష్ సాల్వే తెలిపారు. ‘‘ఆమెతో నేను రాత్రి 8.50గంటల సమయంలో మాట్లాడాను. మీరు కేసు గెలిచారు కదా. దానికి నేను మీ రూ.1ఫీజు ఇచ్చేయాలి వచ్చి కలవండి అన్నారు. దానికి నేను, అవును మేడం ఆ విలువైన రూపాయిని నేను తీసుకోవాల్సిందే అని బదులిచ్చాను. దీనికి స్పందిస్తూ.. మరి రేపు 6గంటలకు రండి అని ఆమె అన్నారు’’ అని ఆమెతో తాను చేసిన సంభాషణను సాల్వే గుర్తుచేసుకున్నారు.