‘చిన్నమ్మ’ ఔదార్యానికి ఇదో ఉదాహరణ

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉన్నంతకాలం పార్టీలకతీతంగా పనిచేసిన ఆమె గొప్ప నాయకురాలిగా పేరొందింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అందించిన సేవలు మరవలేనివి. సుష్మా నుంచి సహాయం పొందిన వారు ఆమెను అమ్మ అని సంభోదించిన సందర్భాలు ఎన్నో. కాగా 2016లో సుష్మా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఆమెకు తమ కిడ్నీని దానం చేసేందుకు ఎంతోమంది […]

‘చిన్నమ్మ’ ఔదార్యానికి ఇదో ఉదాహరణ
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 11:46 AM

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉన్నంతకాలం పార్టీలకతీతంగా పనిచేసిన ఆమె గొప్ప నాయకురాలిగా పేరొందింది. ముఖ్యంగా భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అందించిన సేవలు మరవలేనివి. సుష్మా నుంచి సహాయం పొందిన వారు ఆమెను అమ్మ అని సంభోదించిన సందర్భాలు ఎన్నో.

కాగా 2016లో సుష్మా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సమయంలో ఆమెకు తమ కిడ్నీని దానం చేసేందుకు ఎంతోమంది ముందుకొచ్చారు. వారిలో బీఎస్పీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. ‘‘నేను బీఎస్పీ మద్దతుదారుడిని, ముస్లింను. కానీ నా కిడ్నీని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాకు తల్లి సమానులు. మిమ్మల్ని అల్లా చల్లగా చూడాలి’’ అని ట్వీట్ చేశాడు ముజిబ్ అన్సారీ అనే వ్యక్తి. దానికి స్పందించిన సుష్మా అతడికి కృతఙ్ఞతలు చెబుతూనే.. కిడ్నీకి మతం లేదంటూ పేర్కొన్నారు. కాగా ఆమెకు కిడ్నీని దానం చేసేందుకు అంతమంది ముందుకు వచ్చారంటే.. సుష్మాపై అందరికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుస్తుంది. ఇది ఆమె ఔదార్యానికి సంబంధించిన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఏదేమైనా సుష్మా మరణంతో భారతదేశం మరో గొప్ప నేతను కోల్పోయిందన్న మాత్రం జగమెరిగిన సత్యం.

Latest Articles
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు