AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ మునుపటి స్థితికి భారతీయులు.. ఏడాదిలో 3 టూర్లు

భారతీయ పౌరులు ఏ విషయంలోనూ వెనుకంజ వేయడానికి ఇష్టపడరు. తినడం, తాగడమే కాదు, ప్రయాణాలు చేయడంలోనూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు భారతీయులు తెగ తింటున్నారు అంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అన్నట్టుగానే అప్పటి వరకు పేదదేశంగా ముద్రపడ్డ మన దేశంలో ఊబకాయం అన్నది కూడా ఒక సమస్యగా మారింది.

మళ్లీ మునుపటి స్థితికి భారతీయులు.. ఏడాదిలో 3 టూర్లు
Tourism
Mahatma Kodiyar
| Edited By: Srikar T|

Updated on: Apr 22, 2024 | 11:19 AM

Share

భారతీయ పౌరులు ఏ విషయంలోనూ వెనుకంజ వేయడానికి ఇష్టపడరు. తినడం, తాగడమే కాదు, ప్రయాణాలు చేయడంలోనూ దూసుకుపోతున్నారు. ఒకప్పుడు భారతీయులు తెగ తింటున్నారు అంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అన్నట్టుగానే అప్పటి వరకు పేదదేశంగా ముద్రపడ్డ మన దేశంలో ఊబకాయం అన్నది కూడా ఒక సమస్యగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు “భారతీయులు తెగ తిరుగుతున్నారు” అనేలా పరిస్థితులు తయారయ్యాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ తీర్థయాత్రలు చేసేవారు కొందరైతే హిల్‌స్టేషన్లు, లోయలు, నదులు, జలపాతాలు, బీచ్‌లు ఇలా.. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ విహార యాత్రలు చేసేవారు మరికొందరు. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసేవారు కొందరుంటే.. సకుటుంబ సమేతంగా యాత్రలు చేసేవారు మరికొందరు.. ఇలా మొత్తానికి తమ అభిరుచులను నెరవేర్చుకునే క్రమంలో డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రయాణీకుల సంఖ్య ప్రతియేటా గణనీయంగా పెరుగుతోంది. ఏడాదికి మూడు టూర్లకు వెళ్లే వారి సంఖ్య 2023లో దాదాపు 25% పెరిగిందని కొన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన నెమ్మదించిన తర్వాత తొలిసారిగా పర్యాటక రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా చెప్పాలంటే పరిస్థితులు సాధారణం కంటే మరింత మెరుగుపడ్డాయి.

నాడు నిలిచిపోయిన ప్రపంచం..

కోవిడ్-19 సమయంలో ఆ మహమ్మారిని నియంత్రించే క్రమంలో యావత్ ప్రపంచం తనకు తానుగా లాక్‍‌డౌన్ చేసుకుంది. ఫలితంగా ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రయాణాల మాట దేవుడెరుగు.. కనీసం పొరుగింట్లోకి తొంగి చూడ్డానికి కూడా సాహసించని రోజులవి. ఆ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టి, భయాలు పోగొట్టినా సరే.. ప్రపంచం మళ్లీ అంత త్వరగా కోలుకోలేదు. మహమ్మారి తరువాత కూడా ప్రయాణం ఆగిపోయింది. ప్రజల రాకపోకలు తగ్గాయి. పర్యాటక రంగంలో వేగం మందగించింది. 2019 డిసెంబర్లో మొదలైన మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాలు పూర్తిగా నిర్బంధంలో కొనసాగాయి. 2022 నుంచి పరిస్థితులు కాస్త చక్కబడినప్పటికీ.. పర్యాటక రంగం మాత్రం ఆశించినంత ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు మరోసారి మునుపటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. అంతర్జాతీయ బుకింగ్‌లు మళ్లీ ఊపందుకున్నాయి. దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రజలు నెల రోజులు ముందుగానే అంతర్జాతీయ బుకింగ్‌లు చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో అలాంటివారిలో కోల్‌కతా ప్రజలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 3 నెలల ముందుగానే టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. మరో ఆసక్తికరం విషయం ఏంటంటే.. కోల్‌కతాలోని ప్రయాణికులు భారతదేశం లోపల (డొమెస్టిక్) మాత్రమే కాదు, దేశం వెలుపల (ఇంటర్నేషనల్) ప్రయాణాలకు సైతం ఆసక్తి చూపుతూ 3నెలల ముందుగానే విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ “మేక్ మై ట్రిప్” (Make My Trip) సేకరించిన ‘ఇండియా ట్రావెల్ ట్రెండ్స్’ రిపోర్ట్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థ ద్వారా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్న 10 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్ల బుకింగ్ డేటా ఆధారంగా ఈ లెక్కలు బయటపడ్డాయి.

పర్యాటకానికి పూర్వ వైభవం..

గత ఏడాది నుంచి భారతదేశంలో ప్రయాణాలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రయాణాల బుకింగ్ సరళిని గమనిస్తే.. దేశీయ విమాన సర్వీసుల బుకింగ్‌లలో 46% వారం రోజులు ముందుగానే బుక్ అవుతున్నాయి. అంతర్జాతీయ బుకింగ్‌లలో దాదాపు సగం కనీసం రెండు వారాల ముందుగానే బుకింగ్ జరుగుతుంటాయి. అంతర్జాతీయ ప్రయాణాల్లో కేవలం మూడింట ఒక వంతు మాత్రమే ప్రయాణ తేదీ కంటే ఒక నెల ముందు టికెట్లు ఖరీదు చేస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్ అనంతర భారతదేశంలో ప్రయాణాల పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డేటా ప్రకారం 2023లో దేశీయ ప్రయాణీకులు 15.2 కోట్లకు చేరుకున్నాయి. ఇది 2022లో నమోదైన 12.3 కోట్ల సంఖ్య కంటే 24% ఎక్కువ. కోవిడ్ కంటే ముందునాటి గణాంకాల్లో 2019లో నమోదైన 14.4 కోట్ల ప్రయాణాల కంటే కూడా ఇది 6% ఎక్కువే.

ఇవి కూడా చదవండి

ఈ బుకింగ్‌లలో చోటుచేసుకుంటున్న మరికొన్ని ఆసక్తికర అంశాలను పరిశీలిస్తే.. ప్రయాణ టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో మహిళలు ఎక్కువగా విండో సీట్లు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారని తేలింది. ప్రయాణ సమయంలో ఆహారం, పానీయాల బుకింగ్‌లను గమనిస్తే.. టొమాటో – కీర దోస, పనీర్, సలాడ్, శాండ్‌విచ్ వంటి వంటకాలు దేశీయ విమానాలలో అత్యధికంగా ఆర్డర్ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలన్నీ విమాన ప్రయాణాలకు సంబంధించిందే. రైలు ప్రయాణాలు, టికెట్ల బుకింగ్ తీరును విశ్లేషిస్తే.. అధిక ధరతో కూడిన వందేభారత్ వంటి వేగవంతమైన రైలు ప్రయాణాలకు యాత్రికులు మొగ్గుచూపుతున్నారు. వందే భారత్ రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దేశీయ పర్యాటకం (Domestic Tourism)లో రైలు ప్రయాణాలదే కీలక భాగం. అత్యధిక మంది ప్రయాణికులు నేటికీ వీటిపైనే ఆధారపడుతున్నారు. పర్వదినాలు, వేసవి సెలవులు వంటి సమయంలో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇదంతా దేశీయ పర్యాటక రంగ పురోగతిని సూచిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై