PM Modi: ముస్లింల దుస్థితిపై ఎందుకు మాట్లాడరు.. కాంగ్రెస్, ఎస్పీ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీలపై విరుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపాయని.. ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడలేదంటూ మండిపడ్డారు. ముస్లింల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం నేను ఏనాడూ ఏమీ చేయలేదని అణగారిన ముస్లింల దుస్థితిపై చర్చిస్తే వారి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయంటూ పేర్కొన్నారు.

PM Modi: ముస్లింల దుస్థితిపై ఎందుకు మాట్లాడరు.. కాంగ్రెస్, ఎస్పీ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
Pm Modi
Follow us

|

Updated on: Apr 22, 2024 | 3:58 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహిళల దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటామని కాంగ్రెస్‌ ఎన్నికల హామీ ఇచ్చిందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌కు గెలిస్తే దేశ ప్రజల సంపదను లాక్కుంటారని హెచ్చరించారు. అలీఘడ్‌ అంటే ఒకప్పుడు సీరియల్‌ పేలుళ్లకు మారుపేరుగా ఉండేదన్నారు ఇప్పుడు. యోగి పాలనలో ఇప్పుడు యూపీ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీలపై విరుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపాయని.. ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడలేదంటూ మండిపడ్డారు. ముస్లింల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం నేను ఏనాడూ ఏమీ చేయలేదని అణగారిన ముస్లింల దుస్థితిపై చర్చిస్తే వారి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చే ఫలాలన్నింటిని లాక్కుందని.. ముస్లింలు దుర్భర పరిస్థితులలో జీవించవలసి వచ్చిందంటూ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు చేసిన ముస్లిం మహిళలకు న్యాయం చేశామని మోదీ పేర్కొన్నారు.

గత పది సంవత్సరాలలో ముస్లింల అభ్యున్నతికి పాటుపడ్డామని మోదీ గుర్తుచేశారు. ట్రిపుల్‌ తలాక్‌ బాధితులైన చాలా మంది కూతుళ్ల జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడు ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేసి వారి జీవితాలకు భద్రత కల్పించామన్నారు. నేడు, భారతదేశం హజ్ కోటా పెరగడమే కాకుండా వీసా నియమాలు కూడా సులభతరం చేశామన్నారు. పురుషుడు లేకుండా హజ్‌కు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం మహిళలను అనుమతించిందన్నారు. ఈ రోజుల్లో నేను గత 10 సంవత్సరాలలో చేసినది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ఇంకా చాలా పని ఉందన్నారు. తాను ఇంత మాట్లాడినా.. ఎస్పీ, కాంగ్రెస్ వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదంటూ దుయ్యబట్టారు. ఇప్పటికే.. INDI కూటమి సభ్యులు చాలా నిరాశలో మునిగిపోయారని, వారికి భవిష్యత్తు వైపు చూసే ధైర్యం లేదని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మోదీ ఎందుకు మాట్లాడతారు అంటున్నారు.. భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడం గురించి ఎందుకు గుర్తుచేయరన్నారు. ఈ వ్యక్తులు తమ కుటుంబం, అధికారం కోసం దురాశతో ప్రజలను మోసగించడం తప్ప ఏమీ చేయరంటూ ఫైర్ అయ్యారు.

వీడియో చూడండి..

కాంగ్రెస్, భారత కూటమి కళ్లు ఇప్పుడు సంపాదన, ఆస్తులపైనే ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘తమ ప్రభుత్వం వస్తే ఎవరు ఎంత సంపాదిస్తారు, ఎవరికి ఎంత ఆస్తి ఉందో విచారణ జరిపిస్తాం’ అని కాంగ్రెస్ యువరాజు అంటున్నారంటూ.. రాహుల్ గాంధీ టార్గెట్ మోదీ విమర్శలు సంధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..