Bihar Board Exams: ‘సర్.. నేను పేదవాడిని! నన్ను పాస్ చేయండి.. ప్లీజ్’ టెన్త్, ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల్లో విద్యార్ధుల అభ్యర్థనలు!
ఇటీవల బీహార్‌లో నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షలను నిర్వహించిన స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు.. జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తోంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి మెట్రిక్యులేషన్, ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు బీహార్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు..

భోజ్‌పూర్, మార్చి 10: ఇటీవల బీహార్‌లో నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షలను నిర్వహించిన స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు.. జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తోంది. వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి మెట్రిక్యులేషన్, ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు బీహార్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు వింత అనుభవాలు ఎందురవుతున్నాయి. ఓ విద్యార్ధి తన ఆన్సర్ షీట్‌లో తన కష్టాలు ఏకరువు పెట్టుకుని, పాస్ చేయాలని తన పేపర్ దిద్దే ఉపాధ్యాయుడిని వేడుకోగా.. మరికరేమో తన కష్టాలతోపాటు లవ్ సాంగ్స్ కూడా పేపర్లపై రాసి సహాయం అర్ధించాడు.
‘సర్.. నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి. మా అమ్మ కూలి పని చేస్తుంది. నేను ఫెయిల్ అయితే నన్ను కూడా కూలి పనులకు తీసుకెళ్తుంది’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సర్.. దయచేసి నన్ను పాస్ చేయండి. లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేసి పంపిస్తారు.. కనీసం పాస్ మార్కులైనా వేయండి’ అని రాసింది. ఒక విద్యార్థి ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి బదులు మాటల్లో చెప్పలేని రీతిలో ప్రేమ లేఖ రాశాడు. ఇక ఆ ప్రశ్నాపత్రాలు దిద్దే ఉపాధ్యాయులు వింత సమాధానాలు చదివి తలలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ భోజ్‌పూర్ జిల్లా పరిధిలో ఉన్న విద్యార్ధుల జవాబు పత్రాల్లోని ఆణిముత్యాలు. ఇలా అరడజనుకు పైగా కేంద్రాలలోని మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు ఉన్నాయి. జిల్లాలోని మోడల్ స్కూల్, డాక్టర్ నేమిచంద్ శాస్త్రి, హర్ ప్రసాద్ దాస్ జైన్ స్కూల్, డిస్ట్రిక్ట్ స్కూల్‌లో బీహార్ బోర్డ్ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ జవాబు పత్రాలను తనిఖీ చేయగా విద్యార్థులు రాసిన వింత సమాధానాలు అనేకం బయటపడ్డాయి. ఫన్నీ జోకులు, పద్యాలు, భావోద్వేగ కవితలు కూడా రాశారు. మరికొందరు విద్యార్ధులైతే పేపర్లుదిద్దే ఉపాధ్యాకులను ఏకంగా ఎమోషనల్ బెదిరింపులకు దిగారు. విద్యార్ధుల్లో ఈ విధమైన ధోరణి ఏమాత్రం మంచిది కాదని జవాబు పత్రాలు పరిశీలించిన అఖిలేష్ ప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మీడియాకు తెలిపాడు.
కాగా జిల్లాలో మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ కాపీలను తనిఖీ చేయడానికి బీహార్ బోర్డు అర డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జవాబు పత్రాల తనిఖీ సమయంలో వివిధ సబ్జెక్టుల పేపర్లలో విద్యార్ధులు గమనిక అని హెడ్డింగులు పెట్టి.. కవితలు, పాటలు, ప్రార్థనలు, బెదిరింపులు రాయడం పేపర్లు దిద్దే అధ్యాపకులు కనుగొంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








