Social media: సోషల్ మీడియా కంపెనీలకు తాజా గైడ్‌లైన్స్.. ఇల్లీగల్ కంటెంట్‌కు చెక్ చెప్పకపోతే తిప్పలే!
సామాజిక మాధ్యమాల్లో సమూల మార్పులు.. ఇదీ కేంద్ర ప్రభుత్వం అందుకున్న కొత్త నినాదం. ఐటీ రూల్స్‌ని సవరిస్తూ, కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది కేంద్రం. ఈ మేరకు సోషల్ మీడియా కంపెనీలకు..

సామాజిక మాధ్యమాల్లో సమూల మార్పులు.. ఇదీ కేంద్ర ప్రభుత్వం అందుకున్న కొత్త నినాదం. ఐటీ రూల్స్‌ని సవరిస్తూ, కొత్త గైడ్‌లైన్స్ రూపొందించింది కేంద్రం. ఈ మేరకు సోషల్ మీడియా కంపెనీలకు ఉత్తర్వులు వెళ్లాయి. యూజర్లకు సంబంధించి నియమాలు-నిబంధనలు, గోప్యత విధానం, అగ్రిమెంట్.. అన్నీ ఇంగ్లీష్‌తోపాటు అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలన్నది తాజా నిబంధన. అశ్లీల, విద్వేష, లింగ-జాతి వివక్ష, హవాలా, జూదం లాంటివాటిని ప్రోత్సహించే ఎటువంటి కంటెంటూ పోస్ట్ చేయకుండా సోషల్ మీడియా కంపెనీలు జాగ్రత్తలు తీసుకోవాలన్నది కొత్త కండిషన్. ఒక మెసేజ్ ఎక్కడ పుట్టిందన్న సమాచారాన్ని దాచిపెట్టడం లాంటివి సోషల్ మీడియాలో ఇకపై కుదరవంటోంది కేంద్ర ఐటీశాఖ.
యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదుల్ని 24 గంటల్లో స్వీకరించి.. వాటిని 15 రోజుల్లోగా పరిష్కరించాలన్న నిబంధన మరింత కీలకమైంది. ఇవన్నీ ట్విట్టర్, మెటా, వాట్సప్ లాంటి కంపెనీల సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేవిధంగా ఉన్నాయంటూ కౌంటర్లొచ్చాయి. ఏది ఇల్లీగల్ కంటెంట్ అనే అంశంపై క్లారిటీ లేదు కనుక… ఇల్లీగల్ కంటెంట్‌కి చెక్ చెప్పాల్సిందే అని హెచ్చరించడం డిక్టేటర్‌షిప్ లాంటిదేనన్న విమర్శలొచ్చాయి. ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి కూడా ఎదురుదాడి మొదలైంది.
ముందు టెలివిజన్ నెట్‌వర్క్స్‌ని ఆక్రమించారు.. ఇప్పుడు సోషల్ మీడియా వంతొచ్చింది.. టోటల్ మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకోడానికే మోదీ సర్కార్ ప్రయత్నిస్తోంది అని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్. సామాన్యుడికి అందుబాటులో ఉండే మీడియా సోషల్ మీడియా ఒక్కటేనని, దాన్ని కూడా లాగేసుకుంటే ఆమ్‌ఆద్మీల బతుకు ఆగమేనని విమర్శిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ.. తాజా మార్గదర్శకాలు సోషల్ మీడియా కంపెనీలపై కర్రపెత్తనం చెయ్యడానిక్కాదని, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ని నిరోధించడానికేనని క్లారిటీనిస్తోంది ఇండియన్ ఐటీ మినిస్ట్రీ.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..