AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stampede: తీవ్ర విషాదం.. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి, మరో 30 మందికిపైగా..

గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లైరాయ్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికిపైగా భక్తులు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఆయంలో వార్షిక జాతర సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు సమాచారం.

Stampede: తీవ్ర విషాదం.. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి, మరో 30 మందికిపైగా..
Goa Stampede
Anand T
|

Updated on: May 03, 2025 | 9:54 AM

Share

గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో ఉన్న లైరాయ్‌ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం..శిర్గావ్‌లోని శ్రీ లైరాయ్‌ ఆలయంలో లైరాయ్‌ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది. ఈ జాతరను పుస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు దర్శనానికి వచ్చారు. అయితే ఇక్కడి ఆయలంలో నిప్పుల గుండం తొక్కడం అనేది అనాదితా వస్తున్న ఆచారం.

ఈ క్రమంలో శనివారం ఉదయం నిప్పుల గుండం తొక్కే తంతు మొదలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తు రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగే క్రమంలో  తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా మంది భక్తులు గాయాలపాలయినట్టు తెలుస్తుంది. ఇక స్థానిక భక్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

శ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వహాకులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే