AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా పాలిటిక్స్‌లో సేన వ్యూహం.. దీపావళి తర్వాత ట్విస్ట్ అదేనా ?

గురువారం నాటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కంటే.. శనివారం శివసేన అధినాయకత్వం జారీ చేసిన అల్టిమేటంతో కమల దళానికి షాక్ కొట్టింది. గతంలో తమను పూర్తిగా విస్మరించిన బిజెపి నేతలకు ఎలాగైనా బుద్ది చెప్పాలన్న సంకల్పంతో వున్న శివసేన నాయకత్వం.. మహా ఫలితాల తర్వాత తానేంటో చూపిస్తోంది. గత ఎన్నికలకు ముందు సీట్ల సంఖ్యపై పేచీతోపాటు.. అంతకు ముందు సురేశ్ ప్రభు విషయంలో బిజెపి అనుసరించిన విధానం శివసేన నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. దానికి తోడు 2014 […]

మహా పాలిటిక్స్‌లో సేన వ్యూహం.. దీపావళి తర్వాత ట్విస్ట్ అదేనా ?
Rajesh Sharma
|

Updated on: Oct 26, 2019 | 5:48 PM

Share

గురువారం నాటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కంటే.. శనివారం శివసేన అధినాయకత్వం జారీ చేసిన అల్టిమేటంతో కమల దళానికి షాక్ కొట్టింది. గతంలో తమను పూర్తిగా విస్మరించిన బిజెపి నేతలకు ఎలాగైనా బుద్ది చెప్పాలన్న సంకల్పంతో వున్న శివసేన నాయకత్వం.. మహా ఫలితాల తర్వాత తానేంటో చూపిస్తోంది.

గత ఎన్నికలకు ముందు సీట్ల సంఖ్యపై పేచీతోపాటు.. అంతకు ముందు సురేశ్ ప్రభు విషయంలో బిజెపి అనుసరించిన విధానం శివసేన నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. దానికి తోడు 2014 ఎన్నికల్లో మహా ఫలితాలు బిజెపి అనుకూలంగా సింగిల్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో రావడంతో అయిదేళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది.

అయిదేళ్ళు నిరీక్షించిన శివసేన నాయకత్వం.. మొన్నటి మహారాష్ట్ర ఎన్నికలకుముందు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బిజెపి సీట్ల సంఖ్యను 150కి పరిమితం చేసింది. ఎలాగో మొత్తం సీట్లు గెల్వలేరు కాబట్టి.. తమపై ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిని కల్పించాలని శివసేన భావించింది.

శివసేన అనుకున్నట్లుగానే బిజెపి 104 సీట్లకు పరిమితమైంది. శివసేన లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో నిలబడింది. ఫలితాలు వెలువడిందే తడవుగా.. గురువారం నాడే శివసేన నేత సంజయ్ రావత్ తమ పార్టీ 50:50 షేర్ కట్టుబడి వుందని, అది సీఎం సీటుకు వర్తిస్తుందని వెల్లడించారు. మళ్ళీ ఉద్దవ్ థాక్రే నివాసంలో శనివారం సమావేశమైన శివసేన ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్ళు పంచుకోవాలన్న డిమాండ్‌ను వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి ఈ మేరకు అమిత్‌షా గానీ.. దేవేంద్ర ఫడ్నవీస్ గానీ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని పట్టుబడుతోంది శివసేన. సేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

శివసేన తాజా డిమాండ్‌తో బిజెపి అధినాయకత్వానికి షాక్ తగిలినట్లయింది. దీపావళి తర్వాత శివసేనతో చర్చలకు బిజెపి నాయకత్వం సిద్దమవుతోంది. శివసేనను బుజ్జగించే పనిని దేవేంద్ర ఫడ్నవీస్ అప్పగిస్తూ.. ఇతరత్రా శివసేనను దారిలోకి తెచ్చుకునేందుకు బిజెపి యత్నాలు మొదలుపెట్టింది. బిజెపికి అల్టిమేటం ఇచ్చిన శివసేన.. అవసరమైతే తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో జత కట్టేందుకు సిద్దమని పరోక్షంగా చాటుతోంది. ఈ మేరకు సామ్నా పత్నికలో ప్రచురితమైన ఓ కార్టూన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బిజెపిని సామదానభేద దండోపాలయాలతో దారికి తెచ్చుకోవాలని శివసేన వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో దీపావళి పండగ తర్వాత తేలనుంది.