తనయుని స్థానంలో తల్లి.. హర్యానాలో కొత్త ట్విస్ట్ ?

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. అయితే మహారాష్ట్ర లాంటి ట్విస్ట్ కాకపోయినా హర్యానాలోను ఓ ట్విస్ట్ తెరమీదికొస్తోంది. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ ఎన్నికలై కాసేపటికే జెజెపి కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం అంగీకరానికి వచ్చింది. దీంతో ఖట్టర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు […]

తనయుని స్థానంలో తల్లి.. హర్యానాలో కొత్త ట్విస్ట్ ?
Follow us

|

Updated on: Oct 26, 2019 | 6:10 PM

హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మరోసారి పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. అయితే మహారాష్ట్ర లాంటి ట్విస్ట్ కాకపోయినా హర్యానాలోను ఓ ట్విస్ట్ తెరమీదికొస్తోంది. బీజేఎల్పీ సమావేశంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఖట్టర్ ఎన్నికలై కాసేపటికే జెజెపి కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

10 సీట్లు గెలుచుకున్న జన నాయక జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ శుక్రవారం అంగీకరానికి వచ్చింది. దీంతో ఖట్టర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇరు పార్టీల ఒప్పందంలో భాగంగా జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలాకు ఉప ముఖ్యమంత్రి పదవిని బిజెపి ఆఫర్ చేసింది. అయితే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని తాను చేప్టటకుండా వేరే వారికివ్వాలని భావిస్తుండడమే తాజా ట్విస్ట్.

హర్యానా ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్‌ తల్లి నైనా చౌతాలా(53) పేరును పరిశీలిస్తున్నట్లు శనివారం జన్నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎవరిని డిప్యూటీ సీఎం చేస్తారనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదని అన్నారు. నైనా బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 13వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్‌ నేత రణ్‌బీర్‌ సింగ్‌ మహేంద్రను ఓడించారు. టీచర్ల భర్తీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అజయ్‌ చౌతాలాకు భార్య నైనా చౌతాలా. దబ్వాలి నుంచి ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన నైనా.. 2018లో కుమారుడు దుష్యంత్‌ చౌతాలా(31) స్థాపించిన జన్నాయక్‌ జనతా పార్టీలో చేరారు.

హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 స్థానాలు దక్కించుకోవాలి. కానీ హర్యానాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. అత్యధికంగా 40 సీట్లు గెలిచిన బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శుక్రవారం జేజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా బీజేపీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో 10 సీట్లు గెలిచిన జేజేపీకి డిప్యూటీ సిఎం పదవి ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొంది.

హర్యానాలో స్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీ-జేజేపీ కూటమి అవసరమని భావించడంతో పొత్తుకు అంగీకరించామని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ మనవడైన దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దుష్యంత్ శనివారం సాయంత్రం చండీగఢ్‌లో గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖను సమర్పించనున్నారని సమాచారం.