Shraddha Murder Case: ఇప్పటి వరకూ శ్రద్ధ 17 ఎముకలు లభ్యం… ల్యాబ్‌కు పంపిన అధికారులు.. నేడు అఫ్తాబ్ కు నార్కో టెస్టు నిర్వహించే అవకాశం
రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో ఆఫ్తాబ్ నార్కో టెస్ట్ చేస్తారు. రేపటితో ఆఫ్తాబ్ పోలీసు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈరోజు నార్కో టెస్టు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలోని మెహ్రౌలీకి చెందిన శ్రద్ధా హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసుని ఢిల్లీ పోలీసుల బృందం వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. అఫ్తాబ్ నుంచి రహస్యాన్ని రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అఫ్తాబ్‌ను మెహ్రౌలీ అడవుల్లోకి తీసుకెళ్లారు. అతని ఇంటిలో సోదాలు చేసినప్పుడు పదునైన ఆయుధాన్ని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధంతోనే శ్రద్ధను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. అఫ్తాబ్ నార్కో పరీక్ష నిర్వహణకు కోర్టు అనుమతినివ్వడంతో.. ఈరోజు అఫ్తాబ్‌కు నార్కో టెస్టు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే అడవి నుండి 17 ఎముకలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధా తలకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శ్రద్ధ పుర్రె ఎముకలను గుర్తించిన పోలీసులు: శ్రద్ధా అవశేషాల కోసం ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం అటవీ ప్రాంతం నుంచి పుర్రె భాగాలు, కొన్ని ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ ఢిల్లీలోని మైదన్‌గర్హిలోని చెరువును ఖాళీ చేసేందుకు బృందాలను మోహరించారు. పోలీసుల విచారణలో అఫ్తాబ్ చెరువులో శ్రద్ధ తలను పడేసినట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెరువుని ఖాళీ చేయడం ప్రారంభించారు.
మెహ్రౌలీ అడవుల్లో తనిఖీలు చేస్తోన్న ఫోరెన్సిక్ బృందం శ్రద్ధా హత్య కేసుని పరిశోధించేందుకు ఫోరెన్సిక్ బృందం మెహ్రౌలీ అటవీప్రాంతానికి చేరుకుంది. పోలీసులు ఇప్పటివరకు 17కి పైగా ఎముకలను ఈ అటవీప్రాంతం నుంచే స్వాధీనం చేసుకున్నారు.




హిమాచల్ గెస్ట్ హౌస్‌లో పోలీసుల విచారణ ఢిల్లీ పోలీసుల బృందం హిమాచల్ ప్రదేశ్‌లోని వైట్ లోటస్ గెస్ట్ హౌస్‌కి వెళ్లి విచారణ చేసింది. ఏప్రిల్ 6న, అఫ్తాబ్, శ్రద్ధా హిమాచల్‌లోని తోష్‌కి వెళ్లారు. ఇద్దరూ ఈ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఇద్దరూ ఏప్రిల్ 7న కుట్లాకు బయలుదేరి రాత్రి కుట్లలోనే బస చేశారు.
ప్యాకర్స్ , మూవర్స్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించనున్న పోలీసులు శ్రద్ధా హత్య కేసు విచారణ నిమిత్తం ఇప్పటికే ముంబై చేరుకున్న ఢిల్లీ పోలీసు అధికారులు మీరా రోడ్‌లో విచారణ కొనసాగిస్తున్నారు. అఫ్తాబ్ తండ్రికి చెందిన వస్తువులను వసాయి ఫ్లాట్ నుండి ఛతర్‌పూర్‌కు తరలించినట్లు పోలీసుల బృందం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించనున్నారు.
ఎముకలను ల్యాబ్‌లో పరీక్ష కోసం పంపుతారు అడవిలో దొరికిన 17 ఎముకలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి, ఆ ఎముకలు స్త్రీకి చెందినవా లేదా పురుషుడివి కాదా అనేది నిర్ధారిస్తారు. దీని తర్వాత ఎముకల DNA పరీక్షను నిర్వహించనున్నారు.
అంబేద్కర్ ఆస్పత్రిలో ఆఫ్తాబ్‌కు నార్కో టెస్టు: రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హాస్పిటల్‌లో ఆఫ్తాబ్ నార్కో టెస్ట్ చేస్తారు. రేపటితో ఆఫ్తాబ్ పోలీసు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈరోజు నార్కో టెస్టు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఒక అధికారి మాట్లాడుతూ.. ఆదివారం ఢిల్లీ పోలీసు బృందం హత్యకు సంబంధించి వాంగ్మూలాలను నమోదు చేయడానికి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.
శ్రద్ధా ముక్కల కోసం కొనసాగుతున్న గాలింపు శ్రద్ధా హత్య కేసులో ఆమె మృతదేహంలోని మిగిలిన భాగాలను వెలికితీసేందుకు ఢిల్లీ పోలీసులు ఆదివారం దేశ రాజధానిలోని ఛతర్‌పూర్ అడవులతో సహా పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
శ్రద్ధ తల కోసం చెరువుని తోడేస్తున్న అధికారులు ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను నిరంతరం ప్రశ్నిస్తున్నారు. శ్రద్ధా తల కోసం ఢిల్లీ పోలీసులు మైదాన్ గర్హిలోని భారీ చెరువులో సోదాలు చేపట్టారు. హత్యానంతరం శ్రద్ధ తలను ఈ చెరువులో పడేసినట్లు విచారణలో అఫ్తాబ్ పోలీసులకు తెలిపినట్లు వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పోలీసులు పలువురు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, పెద్ద ట్యాంకర్లతో చెరువును ఖాళీ చేయడం కోసం.. చెరువు నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. అయితే ఈ చెరువు చాలా పెద్దది.. అనేక ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువును ఖాళీ చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు.
మరోవైపు చెరువు చాలా పెద్దది కావడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసి చెరువు ఖాళీ చేయాలంటే చాలా రోజులు పడుతుంది. ఈ చెరువును ఖాళీ చేయడం అంత సులభం కాదు. అంతేకాదు చెరువుని ఖాళీ చేయడంపై గ్రామస్తులు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు పనులను పక్కకు పెట్టి.. ట్యాంకర్‌తో పాటు వెనుదిరిగారు. చెరువులో శ్రద్దా తలను వెతకడానికి పోలీసులు డైవర్ల సహాయం తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




