AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం

మహనార్-హాజీపూర్ ప్రధాన రహదారిలోని దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుక విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రక్కు జనాలపైకి వెళ్లిపోయింది. సంఘటనా స్థలంలోనే 7 గురు చనిపోయారు.

Road Accident: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పాదచారుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు చిన్నారుల దుర్మరణం
Road Accident
Basha Shek
|

Updated on: Nov 20, 2022 | 10:48 PM

Share

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై అదుపుతప్పిన ఓ ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైశాలి జిల్లా దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. మహనార్-హాజీపూర్ ప్రధాన రహదారిలోని దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్‌పూర్ లో జరిగిన ఓ వివాహ వేడుక విందులో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రక్కు జనాలపైకి వెళ్లిపోయింది. సంఘటనా స్థలంలోనే 7 గురు చనిపోయారు. అదే సమయంలో ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. క్షతగాత్రులను ట్రక్కు కింద నుంచి బయటకు తీశారు. స్థానికుల సహకారంతో పోలీసులు వారిని. జిల్లా ఆస్పత్రికి తరలించారు.  కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి