AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణె- బెంగళూరు హైవే ఘోర ప్రమాదం.. ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం..

మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు..

పుణె- బెంగళూరు హైవే ఘోర ప్రమాదం.. ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం..
Road Accident
Amarnadh Daneti
|

Updated on: Nov 21, 2022 | 8:09 AM

Share

మహారాష్ట్రలోని పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని నావెల్‌ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భారీ రోడ్డు ప్రమాదంతో పూణె, బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  బ్రేకులు ఫెయిల్ కావడం, వాహనం లోడ్ తో ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా వాహనాలు ధ్వసమయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది