Adar Poonawalla: సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు: కేంద్ర హోంశాఖ ప్రకటన
Serum Institute CEO Adar Poonawalla: సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది..
Serum Institute CEO Adar Poonawalla: సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. అయితే సీరం సంస్థనే కోవిషీల్డ్ కోవిడ్ టీకా తయారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యాక్సీన్ డ్రైవ్‌కు ఈ టీకాను ఉపయోగిస్తున్నారు. టీకా విక్రయాల్లో మూడు రకాల ధరలు నిర్ణయించడం, సరిపడినంత టీకాలు అందుబాటులో లేవనే వార్తలతో సీరం సంస్థపై ఒత్తిడి పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధర్ పూనావాలాకు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయానికి కొద్ది సమయం ముందే ఆధర్ పునావాలా కీలక ప్రకటన చేశారు. కోవిషీల్డ్ ధరలను తగ్గిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ టీకా విక్రయాల్లో భిన్న ధరలు ఉండటం, రాష్ట్రాలకు అందించే ధరలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై సీరం ఇనిస్టిట్యూట్‌పై ఒత్తిడి పెరగడంతో ధర తగ్గించక తప్పలేదని అంటున్నారు. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించే టీకా ధరలు మాత్రమే తగ్గించడం విశేషం.
కాగా, రాష్ట్రాలకు తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు. ఇకపై డోసు 300 రూపాయలకు విక్రయిస్తామని తెలిపారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రాలకు డోసు రూ. 400 విక్రయించగా, తమ సంస్థ తరపున ధరను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన ట్వీట్ చేశారు.