Suicide: తుపాకితో గుండెలపై కాల్చుకున్న యువకుడు.. భయాందోళనకు గురైన తండ్రి..
ఓ విద్యార్థి ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరు ఉత్తర తాలూకాలోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నైస్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కొడుకు విష్ణు. తన తండ్రి రేషన్ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రేషన్ తేవడానికి వెళ్లగా, విషు తుపాకీతో కాల్చుకుని తన తండ్రికి ఫోన్ చేశాడు.

ఓ విద్యార్థి ఛాతీపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరు ఉత్తర తాలూకాలోని మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నైస్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు కొడుకు విష్ణు. తన తండ్రి రేషన్ తీసుకురావడానికి వెళ్లిన సమయంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రేషన్ తేవడానికి వెళ్లగా, విష్ణు తుపాకీతో కాల్చుకుని తన తండ్రికి ఫోన్ చేశాడు. ఇకపై తప్పు చేయను అని అన్నాడు. తన కొడుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని భయాందోళనకు గురైన తండ్రి.. ఇంటికి వచ్చి చూస్తే రక్తపు మడుగులో కుప్పకూలిన విషు కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో విష్ణు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
ఈ కేసు పీణ్య స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆత్మహత్యకు ఉపయోగించిన డబుల్ బ్యారల్ తుపాకీని మదనాయకనహళ్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇల్లు పీణ్య పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ నుంచి పీణ్య పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసేందుకు మదనాయకనహళ్లి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం యాంత్రాంగం స్పందించింది. కారణం ఏదైనా, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోకండి. మీకు ఆత్మహత్య ఆలోచనలు ఉంటే మీ ప్రియమైన వారితో మాట్లాడేందుకు ప్రయత్నించండి అని తెలిపింది. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే ఆత్మహత్య హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండని సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








