BJP Target 50: మిషన్ సౌత్.. పోగొట్టుకున్న చోటే కాదు.. కొత్త చోటా బీజేపీ వెతుకులాట..!

ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోల్చితే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితంకాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు.

BJP Target 50: మిషన్ సౌత్.. పోగొట్టుకున్న చోటే కాదు.. కొత్త చోటా బీజేపీ వెతుకులాట..!
Bjp
Follow us

|

Updated on: Jan 04, 2024 | 1:51 PM

కమల వికాసం కేవలం ఉత్తర భారతంకే పరిమితమా..? దక్షిణ భారతంలో బీజేపీకి అంత సీన్ లేదా..? విపక్ష నేతలు తరచూ చేస్తే ఆరోపణలు ఇవే. అందుకు తగ్గట్టుగానే గణాంకాలు ఉండటం… ఆ పార్టీ నేతలకు కాస్త మింగుడుపడని అంశమే. ముఖ్యంగా దక్షిణాదిలో జాతీయ పార్టీలతో పోల్చితే నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పార్టీలదే హవా. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే పెత్తనం చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణలో మాత్రమే జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితంకాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ లెక్కలు వర్కౌట్ కాలేదు. నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది నుంచి 29 ఎంపీ సీట్లొస్తే.. అందులో 25 ఎంపీ స్థానాలు కేవలం కర్ణాటక నుంచే వచ్చాయి. మిగిలిన నాలుగు తెలంగాణలో వచ్చాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా కర్ణాటకలో మళ్లీ కమలం ఆ స్థాయిలో వికసిస్తుందా..? అంటే.. డౌటే అన్న సమాధానం రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.

అయితే.. ఎక్కడ అసాధ్యం అన్న పదం వినిపిస్తుందో.. అక్కడ సుసాధ్యం చేసుకోవడంలో బీజేపీ పెట్టింది పేరు. రెండున్నర దశాబ్దాల క్రితం వరకు అసలు దేశంలో అధికారంలోకి రావడమే కష్టమన్నారు.. కానీ పదేళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతుండటం మనం ఇప్పుడు చూస్తున్నదే. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించాలని కమలనాథులు ఇప్పుడు ఉవ్విళ్లూరుతున్నారు. ఏకంగా 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకొని మరీ పని చేసే స్థాయికి ఆ పార్టీ ఎదిగింది. మరీ ముఖ్యంగా దేశ వ్యాప్తంగా బీజేపీని ఎదిరించేందుకు సుమారు 30 పార్టీలు ఏకమైనా తగ్గేదే లే అంటూ సమరభేరి మోగిస్తోంది బీజేపీ. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో సూపర్ విక్టరీ సాధించిన బీజేపీ.. ఉత్తరాదిలో తమను కొట్టే పార్టీయే లేదన్న రేంజ్‌లో మిగిలిన పార్టీలకు సవాల్ విసురుతోంది. అయితే ఆ పార్టీకి అసలు చిక్కల్లా ఇప్పుడు దక్షిణాదిలోనే.. అందుకే ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ మొత్తం సౌత్‌పైనే పెట్టింది. ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కలిపి ఎలాగైనా 50 సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకు గ్రౌండ్ వర్క్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేసేసింది. తమ ప్లాన్‌ను 100 పర్సెంట్ అమలు చెయ్యడం కూడా మొదలు పెట్టేసింది.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది పెద్దల నానుడి. అయితే ఇది రాజకీయాలకు పూర్తిగా వర్కౌట్ కాదన్నది కమలనాథులు విశ్వాసం. అందుకే పోగొట్టుకున్న చోటికే పరిమితంకాకుండా. కొత్తగా అడుగుపెట్టని చోట సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. గతంలో 25 లోక్ సభ సీట్లు సాధించిన కర్నాటకలో ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేదు. ఈ సారి అక్కడ అన్ని సీట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. కనుక మిగిలిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలను టార్గెట్ చేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాల సంఖ్య చూస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, పుదుచ్చేరిలో 1 అంటే మొత్తంగా 102 స్థానాలు కర్నాటలో ఉన్న 28 లోక్ సభ స్థానాలతో కలిపితే మొత్తం 130. సో.. ఈ 130 స్థానాల్లో కనీసం 50 సీట్లు సాధించాలన్నది కమలనాథుల లక్ష్యం. లక్ష్యం దిశగా అడుగులు కాదు.. ఏకంగా పరుగులే పెడుతోంది.

స్టేట్ టూ స్టేట్.. ఎలా ప్లాన్ చేసింది.. దాన్ని ఎలా వర్కౌట్ చేస్తోందో ఓ సారి చూద్దాం.

తాజాగా ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడులో ఎప్పటి నుంచో సత్తా చాటాలని భావిస్తూ వచ్చిన బీజేపీ అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన గ్యాప్‌ను క్యాష్ చేసుకుందామని ట్రై చేసింది. కొంత మేర వర్కౌట్ అయినట్టు కనిపించినా ఆ ఫలితం మాత్రం 2019 ఎన్నికల్లో ఏ మాత్రం కనిపించలేదు. అందుకే ఈ సారి మాత్రం తమ ప్రయత్నం వృథా కాకూడదని గట్టిగా ట్రై చేస్తోంది. గతంలో ఆ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాలను ఉపయోగించుకుందామని ప్రయత్నం చేసిన బీజేపీ ఈ సారి మాత్రం అభివృద్ధి మంత్రంతో తమిళ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తోంది. తాజా ప్రధాని పర్యటనే అందుకు నిదర్శనం. సుమారు 1100 కోట్ల రూపాయల ఖర్చుతో తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను ప్రారంభించడంతో పాటు సుమారు 20 వేల 140 కోట్ల రూపాయల విలువైన రైల్వే, హైవేలు, పెట్రోలియం, సహజవాయు, అణు శక్తి ఇలా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు .కొద్ది రోజుల క్రితం తమిళనాడును వర్షాలు, వరదలు కుదిపేసినప్పుడు కూడా కేంద్రం తమిళ ప్రజలకు అన్ని విధాలా తోడుంటుందని చెప్పడమే కాదు.. చేతల్లో చేసి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా తమిళ ప్రజలకు కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని పదే పదే చెప్పడం ద్వారా తమిళ ప్రజల్లో స్థిరమైన చోటు సంపాదించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇదంతా అని చెప్పొచ్చు.

ఇక కేరళలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అడుగుపెట్టడం కష్టంగానే ఉంటోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కాదని కేరళ జనం ఇంకా పూర్తిగా బీజేపీని నమ్మడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతి సారి కేరళలో ప్రజల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా త్రిస్సూర్‌లో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏకంగా 2 లక్షలమంది జనాన్ని రప్పించడం ద్వారా ఓ రకంగా ఆ రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు వార్నింగ్ ఇచ్చింది బీజేపీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సభతోనే బీజేపీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. అలా ఈ సభ ద్వారా పరిస్థితులు గత ఎన్నికల మాదిరి ఈ సారి ఉండవని… ప్రత్యర్థి పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. బీజేపీకి సౌత్‌లో స్థానం లేదన్న కాంగ్రెస్ నేతల కామెంట్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇక తెలంగాణ విషయానికొస్తే… ఇక్కడ తమిళనాడు, కేరళలో ఉన్న పరిస్థితులు లేవు. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్‌ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది. 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. నిజానికి బీజేపీ అనగానే తెలంగాణలో అర్బన్ ఏరియాలోనే ఆ పార్టీకి పట్టుందన్న వాదన ఈ ఎన్నికల ముందు వరకు వినిపించింది. కానీ అనుహ్యాంగా ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి టూ టైర్ సిటీల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సారి బీజేపీ ప్రభావం బాగానే కనిపించింది. రాష్ట్రంలో అధికారానికి ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ సౌత్‌లో నిర్ధేశించుకున్న టార్గెట్ చేరేందుకు బీజేపీకి తెలంగాణలో చాలా అవకాశం ఉందన్న ఫీల్ గుడ్ మూమెంటమ్ అయితే వచ్చింది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే గల్లిలో అధికారంలో ఎవరున్నా.. ఢిల్లీలో మాత్రం మోదీయే ఉండాలన్న నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంతే కాదు.. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్-బీజేపీ మాత్రమే ఫైట్ ఉండబోతోందన్న వాతావరణం క్రియేట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అలా బీఆర్ఎస్‌ను సైడ్ చేస్తూ ఆ ప్లేస్‌ను తాను ఆక్రమించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇక ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఒక వేళ ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ-జనసేన.. టీడీపీతో కలిస్తే పరిస్థితులు ఒకలా ఉంటాయి. లేదా ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయి. సో.. ఏపీ విషయంలో బీజేపీ ఎంత మేర ఫోకస్ చేస్తుందన్నది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

పాండిచ్చేరిలో ఇప్పటికే కూటమితో కలిసి అధికారంలో ఉంది. అక్కడ ఉన్న ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా వదులుకునే ఆలోచనలో లేదు బీజేపీ.

మొత్తంగా 2024లో ఎలాగైనా దేశ వ్యాప్తంగా ఒంటరిగా 350 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందులో 50 స్థానాలు దక్షిణాదిలో రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మరి ఈ మూడు నెల్లలో పరిస్థితులు ఎలా మారతాయి..? ఎవరికి అనుకూలంగా మారతాయి..? బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా… అందుకోసం మున్ముందు బీజేపీ ఇంకా ఎలాంటి వ్యూహాలు రచించబోతోంది..? ఇవన్నీ ఇప్పుడు అత్యంత ఆసక్తికరం.

-రవి కుమార్ పాణంగిపల్లి, టీవీ9 తెలుగు

దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించనున్న సంస్థ..
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో ఘర్ వాపసీ చిచ్చు.. క్యాడర్‎లో వ్యతిరేకత
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
వేసవిలో శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి..
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాదు.. వీటిని కొన్నా ధనలాభమే!
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.