Wife Case On Husband: కట్టుకున్న భార్యనే అలా చేయాలనుకున్నాడు కసాయి భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది..
బెళగావి జిల్లా వంతమూరి గ్రామంలో మహిళను బట్టలు విప్పి దాడి చేసిన ఉదంతం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బైలహోంగళ తాలూకాలోని తిగాడి గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టుకున్న భార్యను నగ్నంగా వీడియో, ఫోటో రికార్డు చేసి విడాకులు కోరుతూ భార్యను వేధిస్తున్నాడు భర్త. ఈ ఉదంతం బెళగావి నగరంలో చోటు చేసుకుంది.

బెళగావి జిల్లా వంతమూరి గ్రామంలో మహిళను బట్టలు విప్పి దాడి చేసిన ఉదంతం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బైలహోంగళ తాలూకాలోని తిగాడి గ్రామంలో ఓ మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్టుకున్న భార్యను నగ్నంగా వీడియో, ఫోటో రికార్డు చేసి విడాకులు కోరుతూ భార్యను వేధిస్తున్నాడు భర్త. ఈ ఉదంతం బెళగావి నగరంలో చోటు చేసుకుంది. తనకు విడాకులు ఇవ్వకుంటే అసభ్యకరమైన వీడియో, ఫోటో తీస్తానని భార్యను బెదిరిస్తున్నట్లు తెలిపింది తన భార్య. దీనిపై స్పందించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. మరో పెళ్లి చేసుకునేందుకు భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిపింది ఆ మహిళ.
బెల్గాం నగరానికి చెందిన కిరణ్ పాటిల్ తన భార్యకు విడాకులు ఇచ్చి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అందుకే విడాకులు ఇవ్వాలని భార్యను వేధించేవాడు. భర్త బెదిరింపులకు భయపడిన భార్య పలుమార్లు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భర్త కిరణ్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అంతటితో సరిపెట్టకుండా భార్యను బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఆ మహిళ తన భర్తపై జిల్లా సైబర్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించగా మొబైల్ ఫోన్‌లో భార్య అసభ్యకర వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు.
భార్య అభియోగం రుజువు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా కిరణ్ తప్పించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే అతడిని రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకోవడంతో నిన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కిరణ్‌ను పోలీసులు హిండలగ జైలుకు తరలించారు. ఈ విషయాన్ని టీవీ9కి ఎస్పీ డా. భీమశంకర్ గులేద్ వివరించారు. జిల్లా సైబర్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి అతడి మొబైల్‌ను పరిశీలించారు. మహిళ చెప్పినట్లు అతని మొబైల్ ఫోన్‌లో కొన్ని వీడియోలు, ఫొటోలు లభ్యమయ్యాయి. ఆ కోణంలో అరెస్టు చేయగా నిందితులు తప్పించుకుని పారిపోయారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడని, పోలీసులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








