AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Session 2022: ఇవాళ్టి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలను రెడీ చేసుకుంటున్న పాలక, విపక్షాలు

రెండో విడత పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Budget Session 2022: ఇవాళ్టి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. అస్త్రాలను రెడీ చేసుకుంటున్న పాలక, విపక్షాలు
Sanjay Kasula
|

Updated on: Mar 14, 2022 | 7:46 AM

Share

రెండో విడత పార్లమెంట్​ బడ్జెట్(Budget Session Parliament) సమావేశాల సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సభలు ఒకేసారి భేటీ కానున్నాయి. కోవిడ్ నిబంధనల(Covid Restrictions) ప్రకారం సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ విడతలో పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సాహంతో అధికార బీజేపీ, పరాజయ భారంతో కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు ఈ సమావేశాల్లో ఉత్సాహంగా పార్లమెంట్‌కు రానున్నాయి.

ఏప్రిల్‌ 8 వరకు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. జమ్ము కశ్మీర్‌ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత వైఖరి, భారతీయుల తరలింపుపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ పార్లమెంటుకు వివరిస్తారు.

బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోక్​సభలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్​ను కూడా పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది.

బడ్జెట్ సమావేశాల తొలి భాగం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి.

ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..

Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి