Rs 2,000 Notes Exchange: ఇప్పటి వరకూ 17 వేల కోట్ల రూపాయల రెండు వేల నోట్లు వచ్చాయ్: ఎస్బీఐ
దేశ వ్యాప్తంగా 2 వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించిన సంగతి తెలసిందే. చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లు మొత్తం కరెన్సీలో కేవలం 10 శాతమే ఉండటంతో బ్యాంకుల..
దేశ వ్యాప్తంగా 2 వేల రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించిన సంగతి తెలసిందే. చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లు మొత్తం కరెన్సీలో కేవలం 10 శాతమే ఉండటంతో బ్యాంకుల వద్ద చిన్న చిన్న క్యూలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగనుంది. మే 30 నాటికి రూ.17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్‌కాగా, రూ.3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా మంగళవారం తెలిపారు.
బ్యాంక్‌లకు వస్తున్న ఖాతాదారులు రెండు వేల నోట్లలో 80 శాతం వరకూ డిపాజిట్ చేస్తున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వింగ్ ఎకోరాప్ వెల్లడించింది. కేవలం 20 శాతం నోట్లను తక్కువ విలువగల నోట్లలోకి మార్చుకుంటున్నట్లు తెల్పింది. ఈ డిపాజిట్ల కారణంగా మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌ల పరంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లక్ష కోట్లకంటే గణనీయంగా పెరుగుతుందని ఎకోరాప్ అంచనా వేసింది. ప్రస్తుత సమాచారం మేరకు ఈ విషయాలు వెల్లడిస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.