ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసు నిందితుడు మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే డిస్మిస్ , ముంబై ఉన్నతాధికారుల ఆదేశాలు

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో సస్పెండైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేశారు.

  • Publish Date - 9:10 pm, Tue, 11 May 21 Edited By: Phani CH
ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసు నిందితుడు మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే డిస్మిస్ , ముంబై ఉన్నతాధికారుల ఆదేశాలు
Sachin Vaze

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో సస్పెండైన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వాజే జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్నారు. కారు విడిభాగాల డీలర్ మాన్ సుఖ్ హీరేన్ మృతి కేసులో కూడా వాజే నిందితుడిగా ఉన్నారు. తన భర్త మృతికి వాజేయే కారకుడని హిరేన్ భార్య గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఫిబ్రవరిలో అంబానీ ఇంటి వద్ద నిలిపి ఉంచిన వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ని ఖాకీలు కనుగొన్నారు. ఆ సమయంలో సచిన్ వాజే, హీరేన్ అక్కడే ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నిర్ధారించారు. ఆ తరువాత హిరేన్ థానేలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసు శాఖలో కొనసాగాలంటే తనకు రూ.. 2 కోట్లు ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తనను కోరారని వాజే ఎన్ఐఏ అధికారులకు తెలిపారు. అయితే వాజే నీతిమంతుడేమీ కాదని ఆ తరువాత ఈ సంస్థ అధికారుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అటు-వాజేతో బాటు ఈ కేసులో మాజీ కానిస్టేబుల్ వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేష్ గౌర్, వాజే సహచరుడైన రియాజ్ ఖాజీ కూడా జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నారు.
వాజే డిస్మిస్ కావడంతో ఇక ఆయనకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలూ అందబోవు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: యూపీ లోని బుదౌన్ లో మత గురువు అంత్య క్రియల్లో పాల్గొన్న వేలాది జనం, ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన పోలీసులు

క్రికెట్‌నూ ప్రేమించింది.. ఆ ఆటగాడిని లవ్ చేసింది.. స్పోర్ట్స్ యాంకర్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్..