పెగాసస్ పై మళ్ళీ రభస.. రాజ్యసభ నుంచి ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
పెగాసస్ వివాదంపై బుధవారం కూడా పార్లమెంటు అట్టుడికింది. దీనిపై ప్రభుత్వం చర్చను చేపట్టాలంటూరాజ్యసభలో విపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పట్టు బట్టారు
పెగాసస్ వివాదంపై బుధవారం కూడా పార్లమెంటు అట్టుడికింది. దీనిపై ప్రభుత్వం చర్చను చేపట్టాలంటూరాజ్యసభలో విపక్షాలు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పట్టు బట్టారు. ఆరుగురు ఎంపీలు చేత ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ సభ వెల్ లోకి దూసుకుపోయారు. సీట్లలోకి వెళ్లి కూర్చోవలసిందిగా చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కోరినప్పటికీ వారు వినకుండా అక్కడే తమ నినాదాలు కొనసాగించారు. దీంతో ఆయన ఆదేశాలపై వీరిని ఈ రోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. డోలా సేన్, నదీముల్ హక్, అబిర్ రంజాన్ బిస్వాస్, శాంతా భెట్రీ, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్ అనే ఈ ఎంపీలను ఒక రోజుకు సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సభ ప్రారంభమైన వెంటనే వీరు తమ నిరసనను తెలిపారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన సుఖేందు రాయ్, కాంగ్రెస్ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే, కె.సి. వేణుగోపాల్, సీపీఎం సభ్యులు కరీం, వి.శివదాసన్, సీపీఐ ఎంపీ బినయ్ విశ్వ సమర్పించిన నోటీసులను వెంకయ్యనాయుడు తిరస్కరించారు. ఇవన్నీ పెగాసస్ సంబంధ నోటీసులే..
రైతుల నిరసన, ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితి వంటి సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వాటిపై చర్చించవచ్చునని చైర్మన్ చెప్పారు. అటు- ఈ అంశాలపై చర్చకు అనుమతించాలని ఇప్పటివరకు కోరిన విపక్షాలు ముఖ్యంగా పెగాసస్ కుంభకోణం మీద చర్చ జరగాలని పట్టు బడుతున్నాయి. అటు ఉభయ సభలూ కొన్ని కీలక బిల్లులను హడావుడిగా పాస్ చేయడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Tokyo Olympics: సెమీ ఫైనల్‌లో ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. 2-1 తేడాతో ఓటమి
Yellandu: ప్రేమన్నాడు.. ప్రాణంకన్నా ఎక్కువన్నాడు..పెళ్లి తర్వాత మూన్నాళ్లకే..