Rakshasudu2: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతున్న రాక్షసుడు2.. సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు.?

తమిళ్ ప్రేక్షకులతోపాటు తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకున్న సినిమా రాక్షసుడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు

Rakshasudu2: భారీ బడ్జెట్‌‌‌‌తో తెరకెక్కుతున్న రాక్షసుడు2..  సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు.?
Rakshasudu 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 04, 2021 | 5:23 PM

Rakshasudu2.. తమిళ ప్రేక్షకులతోపాటు తెలుగు ఆడియన్స్‌‌‌ను కూడా విపరీతంగా ఆకట్టుకున్న సినిమా రాక్షసుడు. సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌‌‌‌ను  తెరకెక్కించాలని చూస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. సొంత కథతో ఈ సినిమాను ప్లాన్ చేసున్నాడు రమేష్ వర్మ. ప్రస్తుతం రవితేజతో ఖిలాడి అనే సినిమా చేస్తున్న రమేష్ వర్మ.. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాక్షసుడు2ను పట్టాలెక్కించనున్నాడు. ఫస్ట్ పార్ట్‌‌‌ని నిర్మించిన కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం ఆసక్తిగా మారింది. స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడని చిత్రయూనిట్ హింట్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాలో తమిళ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడని ఆమధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం 100 కోట్ల బడ్జెట్‌‌‌ను కేటాయించామని.. సినిమాను పూర్తిగా లండన్‌‌‌లో షూట్ చేస్తామని తెలిపారు నిర్మాత. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించనున్నారట. అయితే విజయ్ సేతుపతిని ఇప్పటికే చిత్రయూనిట్ సంప్రదించారని.. కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే  ఓ బాలీవుడ్ హీరో యాక్టర్ కూడా ఉంటే సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని అనుకుంటున్నారట. ఇందుకోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని కూడా సంప్రదించారట. ఇక గిబ్రాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allari Naresh: మళ్లీ పాత రోజులు రావాలి.. వరుస సినిమాలు థియేటర్లకు రావాలి: అల్లరి నరేష్

Induvadana: ఆకట్టుకుంటున్న ‘ఇందువదన’ టీజర్.. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.

నా భర్తకు చాలామంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయి.. సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ భార్య..

Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ‘వరుడు కావలెను’నుంచి మరో సాంగ్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!