AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: మళ్లీ పాత రోజులు రావాలి.. వరుస సినిమాలు థియేటర్లకు రావాలి: అల్లరి నరేష్

కరోనా మహమ్మారి అన్ని ఇండస్ట్రీల పైనా భారీ ప్రభావాన్ని చూపింది. ,ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పైన కరోనా ప్రభావం గట్టిగా పడింది.

Allari Naresh: మళ్లీ పాత రోజులు రావాలి.. వరుస సినిమాలు థియేటర్లకు రావాలి: అల్లరి నరేష్
Allari Naresh
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2021 | 4:54 PM

Share

Allari Naresh: కరోనా మహమ్మారి అన్ని ఇండస్ట్రీల పైన భారీ ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ పైన కరోనా ప్రభావం గట్టిగా పడింది. సినిమా షూటింగ్‌‌‌‌లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఉపాధి లేక సినీకార్మికులు అల్లాడిపోయారు. రిలీజ్‌‌‌కు రెడీ అయిన సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత మెల్లగా కరోనా ప్రభావం తగ్గడంతో తిరిగి షూటింగ్‌‌‌లు ప్రారంభం అవ్వడం ఆ తర్వాత కొద్దిరోజులకే సెకండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో పరిస్థితి మళ్లీ  మొదటికొచ్చింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే  తిరిగి షూటింగ్‌‌‌లు మొదలయ్యాయి. అయితే థియేటర్స్ మూసివేయడంతో చాలా సినిమాలు ఓటీటీని నమ్ముకుంటున్నాయి. చిన్న సినిమాలే కాదు నారప్ప లాంటి పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టడంతో కాస్త గందరగోళం నెలకొంది. ఇక ఇటీవలే థియేటర్స్‌‌‌‌ను రీఓపెన్ చేశారు. దాంతో పలు సినిమాలు థియేటర్స్‌‌‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమయ్యాయి. వాటిలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమా ఒకటి.  ఈ నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. సెకండ్ లాక్ డౌన్ తరువాత ధైర్యం చేసి ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నారు. అందుకు నిర్మాతలకు హ్యాట్సాఫ్ అన్నారు. మొదటి లాక్ డౌన్ కి .. రెండో లాక్ డౌన్ కి మధ్యలోనే టాలీవుడ్ 16 హిట్లను ఇచ్చింది. అందుకు కారణం తెలుగు ప్రజలకు సినిమాల పట్ల ఉన్న ఇష్టం అని అన్నారు నరేష్. ఇకపై ప్రతి శుక్రవారం వరుస సినిమాలు థియేటర్లకు రావాలి.. మళ్లీ పాత రోజులు రావాలి అని కోరుకుంటున్నాను. జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్స్‌‌‌కి రండి .. లేదంటే కొన్ని రోజులకు థియేటర్లన్నీ  కల్యాణ మండపాలైపోతాయి అని అన్నారు అల్లరి నరేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Induvadana: ఆకట్టుకుంటున్న ‘ఇందువదన’ టీజర్.. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.

నా భర్తకు చాలామంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయి.. సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ భార్య..

Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ‘వరుడు కావలెను’నుంచి మరో సాంగ్..