Induvadana: ఆకట్టుకుంటున్న ‘ఇందువదన’ టీజర్.. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.

చాలా కాలం తర్వాత హీరో వరుణ్ సందేశ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఇందువదన అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

Induvadana: ఆకట్టుకుంటున్న 'ఇందువదన' టీజర్.. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ.
Follow us

|

Updated on: Aug 04, 2021 | 4:03 PM

Induvadana: చాలా కాలం తర్వాత హీరో వరుణ్ సందేశ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఇందువదన అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్ సందేశ్. ఫర్నాజ్ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్నా ‘ఇందువదన’ మూవీలో వాసు – ఇందు అనే పాత్రల్లో కనిపించనున్నారు వరుణ్- ఫర్నాజ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్‌‌‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌‌‌‌ను చూపిస్తూనే  యాక్షన్ సన్నివేశాలను కూడా యాడ్  చేశారు టీజర్‌‌‌లో. ఇక చివరిలో హీరోయిన్‌‌ను దెయ్యంలా చూపించారు. వరుణ్ మరియు ఫర్నాజ్ ఇద్దరూ పాతకాలపు వస్త్రధారణలో కనిపిస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరిందని టీజర్ చూస్తుంటే అర్ధం అవుతోంది.

పీరియాడికల్ రూరల్ డ్రామాని తలపించేలా ఉన్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది. శివ కాకాని అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.  MSR దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ పిక్చర్స్ బ్యానర్ పై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. రఘు బాబు – అలీ – నాగినీడు – సురేఖ వాణి – ధనరాజ్ – తాగుబోతు రమేష్ – మహేష్ విట్ట – పార్వతీషం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నా భర్తకు చాలామంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయి.. సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ భార్య..

Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ‘వరుడు కావలెను’నుంచి మరో సాంగ్..

ఈ క్యూట్ చిన్నారికి సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. తలుపు తడుతున్న వరుస ఆఫర్లు..