Tej Pratap Yadav: పోస్టర్లలో తమ్ముడి ఫోటో లేదేం ? బీహార్ లో మీడియాపై తేజ్ ప్రతాప్ యాదవ్ ఫైర్…
బీహార్ రాష్ట్రంలో పోస్టర్ల వివాదం తలెత్తింది. ఆర్జేడీ కి సంబంధించిన పోస్టర్లలో మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఫోటోలు ఉన్నప్పటికీ తన తమ్ముడు తేజస్వి యాదవ్ ఫోటో లేదంటూ అతని అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ మీడియామీద ఫైరయ్యాడు.
బీహార్ రాష్ట్రంలో పోస్టర్ల వివాదం తలెత్తింది. ఆర్జేడీ కి సంబంధించిన పోస్టర్లలో మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఫోటోలు ఉన్నప్పటికీ తన తమ్ముడు తేజస్వి యాదవ్ ఫోటో లేదంటూ అతని అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ మీడియామీద ఫైరయ్యాడు. మీపై పరువు నష్టం దావా వేస్తానని, ఎఫ్ ఐ ఆర్ కేసులు నమోదు చేయిస్తానని ఆయన హెచ్చరించాడు. తమ పట్ల విష ప్రచారానికి దిగుతున్నవారెవరో తేనెకు తెలుసునన్నాడు. ఎన్నికల సమయంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, మీసా భారతి ఫోటోలు పోస్టర్లలో కనిపించలేదని, ఇప్పుడు కావాలనే తేజస్వి యాదవ్ ను పక్కన బెట్టారని ఆయన ఆరోపించాడు. తేజస్వి తనకు అర్జునుడిలాంటి వాడన్నారు. అతడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పాడు. కానీ ఇదంతా చూస్తే పైకి కనిపించే ఆర్భాటమేనని, ఆర్జేడీలో ఆధిపత్యం కోసం ఈ ఇద్దరు అన్నదమ్ములు లోలోన సిగపట్లు పట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
కేవలం పోస్టర్ లో తన తమ్ముడి ఫోటో లేకపోవడంపై తేజ్ ప్రతాప్ ఇలా గగ్గోలు పెడుతున్నాడని, దీని వెనుక మరో కారణం ఉందని అంటున్నారు. బీహార్ లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళీ క్రియాశీలరాజకీయాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సోదరుల వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఇచ్చిన డిన్నర్ మీటింగ్ కి లాలూ యాదవ్ హాజరై ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపు నిచ్చారు. బహుశా పాట్నాలో పార్టీ ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆయన ఫోటో కూడా ఉండడానికి ఇదో కారణమై ఉండవచ్చునంటున్నారు. కుటుంబ పాలనకు ఇది సంకేతమనే విమర్శలు వస్తున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.