సీన్ ఛేంజ్ ! సుశాంత్ సిస్టర్సే అతని సూసైడ్ కి కారణం, రియా చక్రవర్తి

సుశాంత్ కేసులో మరో కొత్త మలుపు...సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్సే కారణమని రియా చక్రవర్తి ఆరోపించింది. ఈ మేరకు ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీన్ ఛేంజ్ ! సుశాంత్ సిస్టర్సే అతని సూసైడ్ కి కారణం, రియా చక్రవర్తి
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 11:10 AM

సుశాంత్ కేసులో మరో కొత్త మలుపు…సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్సే కారణమని రియా చక్రవర్తి ఆరోపించింది. ఈ మేరకు ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా అతడిని వారు ప్రేరేపించారని, బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ చూపి అతడిని దాదాపు ఛీట్ చేశారని పేర్కొంది. అసలు వాట్సాప్ ద్వారా ఈ విధమైన ప్రిస్క్రిప్షన్ కి అనుమతి లేదని తెలిపింది. సుశాంత్ సింగ్ సిస్టర్స్ ప్రియాంక సింగ్,  మీతూ సింగ్ పైన, ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి డాక్టర్ తరుణ్ కుమార్ సహా మరికొందరి పైనా రియా ఇలా కేసు పెట్టింది. ఈ ప్రిస్క్రిప్షన్ నేపథ్యంలో అందులోని మందులను తీసుకున్న తరువాత సుశాంత్ 5 రోజుల్లో మరణించాడని ఆమె తెలిపింది.

కాగా ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు.