ఎల్‌ఏసీ ప్రాంతంలో పట్టు సారిస్తున్న భారత్

గత కొంతకాలంగా సరిహద్దులో కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ.. మరోసారి తెగబడింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం.

  • Balaraju Goud
  • Publish Date - 10:52 am, Tue, 8 September 20
ఎల్‌ఏసీ ప్రాంతంలో పట్టు సారిస్తున్న భారత్

గత కొంతకాలంగా సరిహద్దులో కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ.. మరోసారి తెగబడింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో ఇరు దేశాల బలగాలు గాల్లోకి హెచ్చరికల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, తొలుత భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ చైనా పశ్చిమ థియేటర్‌ కమాండర్‌ ఆరోపించారు. దానికి ప్రతిస్పందనగానే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందంటూ తొలి నుంచి అనుసరిస్తున్న తమ దురుసు వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై భారత ఆర్మీ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ని మార్చేందుకు చైనా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల తూర్పు లద్దాఖ్‌, పాంగాంగ్‌ సరస్సు సమీపంలో కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నించింది. చైనా కుట్రలను ధీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం.. వారి కంటే ముందే కీలక పర్వత ప్రాంతాల్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో వివాదాస్పద ప్రాంతంలోని కీలక స్థావరాలన్నీ భారత్‌ గుప్పిట్లోకి వచ్చాయని సమాచారం. అయితే, ఎక్కడా భారత్‌ నిబంధనల్ని ఉల్లఘించలేదు. అలాగే చైనా-భారత్ సరిహద్దులోని వాస్తవాధీన రేఖను దాటలేదు. ఎల్‌ఏసీకి భారత్‌ వైపున్న ప్రాంతాలపైనే మాత్రమే సైన్యం పట్టు సాధించింది. తాజాగా సోమవారం రాత్రి మరో కీలక ప్రాంతమైన షెన్‌పావో పర్వతంపై కూడా భారత్‌ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. దీంతో దుర్బుద్ధితో ముందుకు సాగుతున్న చైనా కదలికలపై నిఘా వేసే అవకాశం లభించింది. భారత్ భూభాగంపై చైనా కుట్రలు సాగవని అర్థమవుతుండడంతో కొత్త పల్లవీని ఎత్తుకుంటుంది డ్రాగన్ కంట్రీ. కాగా, చైనా జిత్తులను పసిగడుతూనే భారత్ అడుగులు ముందుకు వేస్తోంది.

ఇదిలావుంటే, ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో జ‌రుగుతున్న షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఆ స‌మావేశాల్లో విదేశాంగ మంత్రి జైశంక‌ర్ పాల్గొన‌నున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వైతో ఆయన భేటీ అయ్యే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. అయితే, రెండు దేశాల మ‌ధ్య ఆ స‌మ‌స్య‌పై చాలా లోతుగా రాజ‌కీయ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌్సిన అవసరముందని జైశంక‌ర్ అభిప్రాయపడ్డారు.