విలక్షణ నటుడికి ప్రముఖుల నివాళి
రంగస్థల నటుడిగా కెరీర్‌ని ప్రారంభించి టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ రెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయప్రకాశ్ రెడ్డి మృతికి టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు
రంగస్థల నటుడిగా కెరీర్‌ని ప్రారంభించి టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాశ్ రెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. జయప్రకాశ్ రెడ్డి మృతికి టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.
మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా సంతాపం జేశారు. జయప్రకాశ్ రెడ్డి మృతి తనను కలిచివేసిందన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యుత్తమ నటుడు, కమెడీయన్స్‌లో ఆయన ఒకరు. అతనితో పనిచేయడం ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటుందన్నారు. అతని కుటుంబానికి, అభిమానులకి తన ప్రగాఢ సానుభూతి తెలియశారు.
Saddened by the passing of #JayaPrakashReddy garu. One of TFI’s finest actor-comedians. Will always cherish the experience of working with him. Heartfelt condolences to his family and loved ones.
— Mahesh Babu (@urstrulyMahesh) September 8, 2020
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి ఇక లేరు అనే వార్త బాధాకరం అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu ??
— Jr NTR (@tarak9999) September 8, 2020
జయప్రకాశ్ రెడ్డి గారి మృతి వార్త నన్ను షాక్‌కు గురి చేసిందని రవితేజ అన్నారు. నేను ఆయనను ప్రేమగా మామా అని పిలుస్తాను అంటూ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని నష్టం అని అన్నారు. ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మామ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని రవితేజ ట్వీట్ చేశారు
Very sad to hear about #JayaPrakashReddy garu. I used to fondly call him Mama. This is a huge loss for all of us. My condolences to the family and loved ones. Rest in peace Mama ?
— Ravi Teja (@RaviTeja_offl) September 8, 2020
జయప్రకాశ్ రెడ్డి గారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. షూటింగ్ సమయంలో మీతో ఉన్న క్షణాలు అద్భుతం. మీతో కలిసినప్పుడు ఎంతో సందడిగా ఉంటుంది. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని జెనీలియా ట్వీట్ చేశారు.
RIP #Jayaprakashreddy garu .. Remembering fondly our great times at shoots.. Was always fun interacting with you.. Prayers and strength to the family
— Genelia Deshmukh (@geneliad) September 8, 2020
చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ద్వారా.. జయప్రకాష్ రెడ్డి గారు మరణంతో తెలుగు సినిమా, థియేటర్ మూగబోయింది. ఆయన చేసిన బహుముఖ ప్రదర్శనలు, మరపురాని సినిమాలతో ఎన్నో దశాబ్దాలుగా అలరించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు
Telugu cinema and theatre has lost a gem today with the demise of Jayaprakash Reddy Garu. His versatile performances over several decades have given us many a memorable cinematic moments. My heart goes out to his family and friends in this hour of grief. #JayaPrakashReddy pic.twitter.com/gOCfffmQjP
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 8, 2020