Goa: గోవాలో భారీ వర్షాలు.. ఇప్పుడు వెళ్లకండి.. పాపం వీళ్లు చిక్కుపోయారు..

గోవాలో భారీ వర్షాల దాటికి పాలి వాటర్‌ ఫాల్‌కి వెళ్లిన పర్యాటకులు వరదలో చిక్కుకున్నారు. రెస్యూ సిబ్బంది సాయంతో క్షేమంగా కాపాడారు అధికారులు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Goa: గోవాలో భారీ వర్షాలు.. ఇప్పుడు వెళ్లకండి.. పాపం వీళ్లు చిక్కుపోయారు..
Goa Waterfall
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 07, 2024 | 9:41 PM

గోవాలో పాలి వాటర్ ఫాల్ కి వెళ్లిన సందర్శకులు వరద నీటిలో చిక్కుకున్నారు. జలపాతం చూసేందుకు వెళ్లిన టూరిస్టులకు ఊహించని పరిణామం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా సమీపంలోని నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో దాదాపు 80 మంది వరదలోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను కాపాడేందుకు చర్యలను ముమ్మరం చేసాయి. ఫస్ట్ టైం 50 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో 30 మందిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అక్షత్‌ కౌశల్‌ తెలిపారు.

వీకెండ్ కావడంతో గోవాలోని సత్తారి తాలూకాలోని పాలి జలపాతానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. జలపాతానికి చేరుకునే ముందు నది దాటుకునే వెళ్లారు. తర్వాత భారీ వర్షం రావడంతో నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో 80 మంది పర్యాటకులు వరద చిక్కుకున్నారు. పిఐ వాల్పోయి నేతృత్వంలోని నార్త్ గోవా పోలీసు బృందం అగ్నిమాపక శాఖతో కలిసి సహాయక చర్యలు చేపట్టి కాపాడారు. ఇక గోవా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి గోవా ఎయిర్‌ పోర్టులో భారీగా వరద నీరు చేరింది. వరద నీటిని తొలగించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో జలపాతాల వద్దకు పర్యాటకులు ఎవరూ కూడా వెళ్లొద్దని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులు సైతం సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!