Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన భారతావని.. ఈసారి స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారతదేశం సిద్ధమైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 నుంచి దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు.

Republic Day 2023: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన భారతావని.. ఈసారి స్పెషాలిటీస్ ఏంటో తెలుసా?
Republic Day Parade
Follow us

|

Updated on: Jan 25, 2023 | 10:12 PM

74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు యావత్ భారతదేశం సిద్ధమైంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 నుంచి దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ రోజున రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ.. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సహా దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకులను వైభవంగా జరుపుకుంటారు.

ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం జనవరి 26న జాతీయ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్/కర్తవ్య మార్గ్‌లో నిర్వహిస్తుంది. ఈ రోజున భారత త్రివిద దళాలు పరేడ్ నిర్వహిస్తారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్, ఇండియా గేట్ మార్గాల ద్వారా ఎర్రకోట వరకు ఈ పరేడ్ కొనసాగుతుంది. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి సంయుక్తంగా భారీ పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్‌ను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటారు.

ప్రత్యేక ఆహ్వానితులు..

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్‌ గెస్ట్‌గా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి (Abdel Fattah al-Sisi) హాజరుకానున్నారు. అలాగే, ఈ వేడుకలు శ్రామిక వర్గానికి ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు వేదిక కానున్నాయి. ఎందుకంటే.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములైన కార్మికులు, వారి కుటుంబాలు, కర్తవ్య పథ్‌లోని మెయింటెనెన్స్ వర్కర్లను ప్రకటించింది రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రధాన వేదిక ముందు కూర్చొని వీరంతా పరేడ్‌ను వీక్షించనున్నారు.

ఇవి కూడా చదవండి

గణతంత్ర దినోత్సవ థీమ్ ఇదే..

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌లో మూడు థీమ్స్ ప్లాన్ చేశారు. అవి.. నారీ శక్తి, ఇండియా@75, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ థీమ్-2023. ఈ మూడు థీమ్స్‌లో ఏదైనా ఒకటి గానీ, మూడూ కలిపి గానీ రిపబ్లిక్ డే వేడుకల్లో కళారూపాలు ప్రదర్శించవచ్చు. ఇందుకు సంబంధించి రక్షణ శాఖ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆహ్వానాలు పంపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles