Refrigerator Compressor: రిఫ్రిజిరేటర్ పేలి కుటుంబమంతా సజీవ దహనం.. ముగ్గురు చిన్నారులతో సహా ఆరుగురు మృతి!
రిఫ్రిజిరేటర్ పేలి ఆ కుటుంబంలో అంతులోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు మృత్యువాతపడినట్లు సమాచారం. ఈ ఊహించని ప్రమాదం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఆదివారం (అక్టోబర్ 8) రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల..
జలంధర్, అక్టోబర్ 9: రిఫ్రిజిరేటర్ పేలి ఆ కుటుంబంలో అంతులోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలిన అనంతరం చెలరేగిన మంటల కారణంగా ఆరుగురు మృత్యువాతపడినట్లు సమాచారం. ఈ ఊహించని ప్రమాదం పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఆదివారం (అక్టోబర్ 8) రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అసలీ ప్రమాదం ఎలా జరిగిందంటే..
పంజాబ్‌లోని జలంధర్ జిల్లాకు చెందిన ఓ ఇంట్లో అందరూ టీవీ చూస్తున్న సమయంలో ఆదివారం రాత్రి పెద్ద శబ్ధంతో రిఫ్రిజిరేటర్ పేలిపోయింది. అనంతరం ఇళ్లంతా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంటిళ్లిపాది ఇంట్లోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. మృతులను యశ్‌పాల్ గాయ్ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్ (41), కోడలు రుచి గాయ్ (40), మనవళ్లు మానస (14), దియా (12), అక్షయ్ (10)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. పేలుడుకు గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిళ్లను సేకరించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు.
ఒకే కుంటుంబానికి చెందిన అందరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసధికారులు తెలిపారు.
బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.. 10 మంది దుర్మరణం
తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని రాజేంద్రన్ యాజ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం (అక్టోబర్ 9) 10 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కార్మికులు అల్పాహారం తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారు అప్రమత్తమై ఫ్యాక్టరీ నుంచి బయటపడే లోపే ఘోరం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరియలూరు ప్రభుత్వ కాలేజీకి తరలించారు.గాయపడిన వారిని తంజావూరు వైద్య కాలేజీకి తరలించారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీని స్థాపించినట్లు తెలిసింది. ప్రమాదం గురించి తెలిసి సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. తీవ్రగా గాయపడిన వారికి రూ.1లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు సాయం అందజేస్తామని ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.