Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra Pradhan: రాజీవ్ గాంధీ వ్యతిరేకించలేదా..? రాహుల్ గాంధీ ‘కుల గణన’ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..

Caste Census Politics: జాతీయ రాజకీయాల్లో కుల గణన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణన సర్వేను బహిర్గతం చేసినప్పటి నుంచి.. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ కాంగ్రెస్‌తోపాటు.. పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కులగణన చేపట్టాలంటూ తీర్మానం చేశారు.

Dharmendra Pradhan: రాజీవ్ గాంధీ వ్యతిరేకించలేదా..? రాహుల్ గాంధీ ‘కుల గణన’ వ్యాఖ్యలపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..
Rahul Gandhi -Dharmendra Pradhan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 09, 2023 | 9:47 PM

Caste Census Politics: జాతీయ రాజకీయాల్లో కుల గణన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కుల గణన సర్వేను బహిర్గతం చేసినప్పటి నుంచి.. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలంటూ కాంగ్రెస్‌తోపాటు.. పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కులగణన చేపట్టాలంటూ తీర్మానం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆయా రాష్ట్రాల్లో కుల గ‌ణ‌న చేప‌ట్టేందుకు చర్యలు చేప‌డ‌తార‌ని వెల్లడించారు. కుల గ‌ణ‌న‌కు అనుకూలంగా కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటూ పేర్కొన్నారు. ముందుగా కుల గ‌ణ‌న‌పై విస్తృతంగా చ‌ర్చించామ‌ని, ప్రతిఒక్కరూ మ‌ద్దతిచ్చార‌ంటూ వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్ సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతకుముందు కుల గణను ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధించారు.

ఈ మేరకు ధర్మేంద్ర ప్రధాన్.. కాంగ్రెస్, రాహుల్ గాంధీకి ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు. ఇవాళ కుల గణన ముసుగులో సమాజాన్ని విభజించి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్ర్యం నాటి నుంచి యుపిఎ-2 ప్రభుత్వం వరకు కాంగ్రెస్ కుల గణనను తీవ్రంగా వ్యతిరేకించింది.. కాంగ్రెస్ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు నిర్వహించలేదో ముందుగా చెప్పాలంటూ రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. కుల గణన నిర్వహించే రాజ్యాంగ హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాహుల్ గాంధీ.. కుల గణనపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు.

మండల్ కమీషన్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వారికి 27% రిజర్వేషన్లు కల్పించడాన్ని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా? ఆ రాజకీయ పాపాన్ని కప్పిపుచ్చుకునే వికృత ప్రయత్నంలో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ నాటకాలు ఆడుతున్నారంటూ ధర్మంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..