RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మే 1 నుంచి కొత్త కార్డుల జారీపై నిషేధం.. నిబంధనలు పాటించడం లేదన్న ఆర్‌బీఐ

RBI: అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, డైన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు...

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మే 1 నుంచి కొత్త  కార్డుల జారీపై నిషేధం.. నిబంధనలు పాటించడం లేదన్న ఆర్‌బీఐ
Rbi
Follow us
Subhash Goud

|

Updated on: Apr 25, 2021 | 1:16 PM

RBI: అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, డైన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటే కొత్త దేశీయ క్రెడిట్‌ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే కార్టు నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపర్చడానికి నిబంధనలు ఉల్లంఘించడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ మరియు డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు.. పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌ 2007 (పీఎస్‌ఎస్‌ యాక్ట్‌) కింద దేశంలో కార్డ్‌ నెట్‌వర్క్‌ను నిర్వహించడానికి ఇద్దరికీ అధికారం ఉంది.

పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌, 2007 (పీఎస్‌ఎస్‌ యాక్ట్‌) సెక్షన్‌ 17 కింద కార్డు నెట్‌ వర్క్‌ ఆపరేటింగ్‌కు సంబంధించి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థలకు అనుమతి ఉంది. చెల్లింపు వ్యవస్థతో అనుసంధానించి అన్ని సర్వీసు ప్రొవైడర్లు, వారు నిర్వహించే చెల్లింపు వ్యవస్థకు సంబంధించిన డాటా, ఇతర సమాచారాన్ని ఆరు నెలల్లో తమ ముందు ఉండేలా చూడాలని 2018 ఏప్రిల్‌లో సర్క్యులర్‌ ద్వారా సూచించింది. అయితే దీనిపై అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులు ప్రస్తుత ఇండియన్‌ కస్టమర్లను ప్రభావితం చేయదని, కార్డులను యథావిధంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

Public Provident Fund Scheme: పీపీఎఫ్‌ స్కీమ్‌లో చేరితే రూ.10 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..!