మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు
ముంబైలో మాస్క్ ధరించకుండా క్రికెట్ ఆడిన 20 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలన్న అతడి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది..
ముంబైలో మాస్క్ ధరించకుండా క్రికెట్ ఆడిన 20 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలన్న అతడి అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఖురేషీ అనే ఈ యువకుడు మరో ఆరుగురితో కలిసి రోడ్డు మధ్యలో క్రికెట్ ఆడుతుండగా పోలీసులు వచ్చారు. వారిని చూసి వీళ్లంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఆ తమ సెల్ ఫోన్లను అక్కడే వదిలేశారు. బహుశా మర్చిపోయినట్టు ఉన్నారని ఆ తరువాత పోలీసులు చెప్పారు. కాగా తమ సెల్ ఫోన్ల కోసం వారు తిరిగి రాగ్గా అప్పటికే పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుల్లో ఒకడు తన ఫోన్ ను ఓ పోలీసు నుంచి లాక్కోవడానికి యత్నించగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని ఖాకీలు తెలిపారు. కాగా-అసలే కోవిడ్ కోరలు చాస్తున్న వేళ.. కోవిడ్ రూల్స్ ని అతిక్రమించి ఖురేషీ మాస్క్ ఆడడం నేరమని కోర్టు పేర్కొంది. ఇది అఫెన్స్ అని నీకు తెలిసినా నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించావు.. నిబంధనలను బేఖాతరు చేశావు అని న్యాయమూర్తి అతడికి చీవాట్లు పెట్టారు.
బెయిల్ మంజూరు చేయడానికి ఆయన తిరస్కరించారు. పైగా ముంబై నగరంలో 144 సెక్షన్ కూడా అమలులో ఉంది. ఈ నగరంతో సహా మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. నిన్న ఒక్కరోజే 700 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత సమాచారం తెలిసినా నువ్వు నిబంధనలను పాతరేశావు అంటూ కోర్టు ఖురేషీని తప్పు పట్టింది. అతడికి జుడిషియల్ రిమాండ్ విధించింది. 20 ఏళ్ళ ఈ యువకుడు జైలు పాలు కాక తప్పలేదు.