Vaccination: కోవీషీల్డ్ బాటలోనే..కోవాక్సిన్.. దేశీయంగా తయారవుతున్న వాక్సిన్ల ధర భారీగా పెరిగింది..ఇప్పుడు ఎంత అంటే..
కరోనా మహమ్మారి ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ముందుకు దూసుకుపోతూనే ఉంది. ప్రాణాలను కబలిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ పైనే ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు.
Vaccination: కరోనా మహమ్మారి ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ముందుకు దూసుకుపోతూనే ఉంది. ప్రాణాలను కబలిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ పైనే ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. వేగవంతంగా వెక్సినేషన్ జరగాలని ప్రభుత్వాలూ ప్రయత్నిస్తున్నాయి. ఇక టీకాల విషయానికి వస్తే భారతదేశంలో తయారైన టీకా కోవాక్సిన్ మంచి ఫలితాలు చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఈ టీకా తక్కువ ధరల్లో అందుబాటులో ఉండేది. కానీ, ఇకపై ఈ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. ఈ మేరకు కోవాక్సిన్ టీకా తయారు చేస్తున్న భారత్ బయో టెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. కోవాక్సిన్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ .600 కాగా, ప్రైవేటు ఆసుపత్రులకు 1200 ఉంటుందని భారత్ బయోటెక్ శనివారం రాత్రి తెలిపింది. ఎగుమతి చేసే వ్యాక్సిన్ లకు 15 నుండి 20 డాలర్ల ధరను కంపెనీ ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సిన్ గా కోవాక్సిన్ పేరుగాంచింది. ఇది భారత్ బయోటెక్ ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రయత్నాల ద్వారా తయారైన మొట్టమొదటి స్వదేశీ కరోనా వ్యాక్సిన్. ఇదిలా ఉంటే కోవిషీల్డ్‌ను దేశంలో ఆమోదించిన రెండవ వ్యాక్సిన్‌గా అనుమతి పొందిన సీరం ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ బుధవారం కొత్త ధరలను ప్రకటించింది. కోవిషీల్డ్ ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు, కేంద్రానికి మునుపటిలా 150 రూపాయలకు ఇవ్వనున్నట్టు చెప్పింది.
ఇక ఈ రెండు వ్యాక్సిన్లు కూడా తమ ఉత్పత్తిలో 50 శాతం కేంద్రం నిర్వహిస్తున్న వాక్సినేషన్ కార్యక్రమానికి ఇస్తారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ రాష్ట్రాలు.. ప్రయివేట్ ఆసుపత్రులకు ఇవ్వనున్నారు.
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సిన్లలో ఒకటిగా కోవాక్సిన్ అవతరించింది. ఫేజ్ -3 క్లినికల్ ట్రయల్స్ యొక్క రెండవ మధ్యంతర ఫలితాల ఆధారంగా, టీకా క్లినికల్ ఎఫిషియసీ 78% అని కంపెనీ పేర్కొంది. అంటే, కరోనా సంక్రమణను నివారించడంలో ఇది 78% ప్రభావవంతంగా ఉంటుందని అర్థం. ఇంకో మంచి విషయం ఏమిటంటే, ఈ టీకాను ట్రయల్స్‌లో ఇచ్చిన వారిలో ఎవరూ తీవ్రమైన లక్షణాలను చూపించలేదు. అంటే, తీవ్రమైన లక్షణాలను నివారించే విషయంలో దాని ప్రభావం 100%.
పెరగునున్న కోవాక్సిన్ ఉత్పత్తి.. ఇటీవల, భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 70 కోట్ల మోతాదు ఉత్పత్తి అవుతుంది. కంపెనీ హైదరాబాద్, బెంగళూరులలో తన ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచింది. ఉత్పత్తి గరిష్ట పరిమితికి చేరుకోవడానికి 2 నెలలు పడుతుంది. కోవాక్సిన్ ఉత్పత్తిని పెంచడం కోసం భారత్ బయోటెక్ కంపెనీకి రూ .1,567.50 కోట్ల అడ్వాన్స్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రతి నెలా 5.35 కోట్ల టీకాలు.. జూలై నుంచి ప్రతి నెలా 5.35 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ క్రియారహితం చేసిన టీకాలను తయారు చేస్తుంది. ఈ రకమైన టీకా సురక్షితం, కానీ చాలా సంక్లిష్టతను కలిగి ఉంది. ఇది సిద్ధం చేయడానికి కూడా ఖరీదైనది. అందువల్ల, దీని ఉత్పత్తి లైవ్ వైరస్ టీకా కంటే తక్కువ.
Also Read: మాస్క్ లేకుండా క్రికెట్ ఆడిన యువకుడి అరెస్ట్, బెయిల్ తిరస్కరించిన సెషన్స్ కోర్టు