AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Awards: ప్రభుత్వ పురస్కారాల దరఖాస్తుకు ఒకటే వెబ్ సైట్.. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రం

పద్మ పురస్కారాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ పేరిట కేంద్రప్రభుత్వం ఒకటే వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వంలోని..

Government Awards: ప్రభుత్వ పురస్కారాల దరఖాస్తుకు ఒకటే వెబ్ సైట్.. రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రం
Rastriya Purskar Award
Amarnadh Daneti
|

Updated on: Aug 22, 2022 | 10:49 PM

Share

Government Awards: పద్మ పురస్కారాలతో పాటు ప్రభుత్వం ఇచ్చే వివిధ రకాల పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ పేరిట కేంద్రప్రభుత్వం ఒకటే వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు, ఏజేన్సీలు ఇచ్చే పురస్కారాల కోసం వ్యక్తులు లేదా పలు సంస్థలు సిఫార్సు చేయవచ్చు. ప్రస్తుతం కింది పేర్కొన్న అవార్డుల కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ తెలిపింది.

పద్మ పురస్కారాలు (చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022)

నేషనల్ అవార్డ్ ఎక్సలెన్సీ ఇన్ ఫారెస్టీ-2022 (చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022)

ఇవి కూడా చదవండి

నేషనల్ గోపాల రత్న పురస్కారం-2022 (చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022

నేషనల్ వాటర్ అవార్డ్సు-2022 (చివరి తేదీ 15 సెప్టెంబర్ 2022)

నేషనల్ అవార్డు ఫర్ సీనియర్ సిటిజన్స్- వయో శ్రేష్థ్ సమ్మాన్-2022 (చివరి తేదీ 29 ఆగష్టు 2022)

నేషనల్ అవార్డ్ ఫర్ ఇండివిజువల్ ఎక్సలెన్స్ 2021 (చివరి తేదీ 28 ఆగష్టు 2022)

వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ పురస్కారాలు- 2021 (చివరి తేదీ 28 ఆగష్టు 2022)

వికలాంగులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమైన సంస్థలకు జాతీయ అవార్డులు 2022 (చివరి తేదీ 28 ఆగష్టు 2022)

జాతీయ CSR పురస్కారాలు 2022 (చివరి తేదీ 31 ఆగష్టు 2022)

నారీ శక్తి పురస్కార్ 2023 (చివరి తేదీ 31 అక్టోబర్ 2022)

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2023 (చివరి తేదీ 31 ఆగష్టు 2022)

మద్య వ్యసనం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం నిరోధక రంగంలో అత్యుత్తమ సేవలకు జాతీయ పురస్కారాలు 2022 (చివరి తేదీ 29 ఆగష్టు 2022)

జీవన్ రక్షా పదక్ (చివరి తేదీ 30 సెస్టెంబర్ 2022)

పురస్కారాలకు సంబంధించి మరిన్ని వివరాలు, నామినేషన్ల కోసంరాష్ట్రీయ పురుష్ పోర్టల్ ( https://awards.gov.in ) సందర్శించాలని కేంద్ర హోమంత్రిత్వ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..