AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తుమందు ఇచ్చి మహిళపై రేప్‌.. ఏడాదిగా రాక్షసత్వం సాగిస్తున్న డాక్టర్‌.. ఎట్టకేలకు అరెస్ట్‌..

ఇదే తరహాలో పలువురు మహిళలతో కూడా ఇలాంటి నేరానికే పాల్పడినట్టుగా చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే..

మత్తుమందు ఇచ్చి మహిళపై రేప్‌.. ఏడాదిగా రాక్షసత్వం సాగిస్తున్న డాక్టర్‌.. ఎట్టకేలకు అరెస్ట్‌..
Rape In The Hospital
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2022 | 9:47 AM

Share

మానవత్వం సిగ్గుపడే సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌లో వెలుగు చూసింది. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు రాక్షసుడి అవతారం ఎత్తాడు. చికిత్స సాకుతో మహిళకు స్పృహ కోల్పోయేలా ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మహిళ బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రికి వద్దకు చేరుకుని వీరంగం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు డాక్టర్‌ను కొట్టి బయటకు లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు. అనంతరం నిందితుడైన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జరిగిన ఘటనపై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కొత్వాలి పోలీస్ స్టేషన్ బలోద్‌లో కేసు నమోదైంది. మొత్తం వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

ఈ దారుణ ఘటన బలోద్ నగరంలోని సంజీవని ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సదరు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శిఖర్ గుప్తా చాలా మంది మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్టుగా పోలీసులు తేల్చారు. దాదాపు ఏడాది కాలంగా నిందితుడు తనపై అత్యాచారం చేస్తున్నాడని బాధితురాలు తహ్రీర్ పోలీసులకు తెలిపింది. ఇప్పటికే తనకు అనుమానం కలిగినా సరైన ఆధారంలేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. అయితే గురువారం నిందితుడే స్వయంగా మహిళకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పాడు. దీంతో ఆ మహిళ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి చేరుకుంది. బాధితురాలు సహా, ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆస్పత్రి వద్ద హంగామా సృష్టించారు. నిందితుడైన డాక్టర్‌ని చితకొట్టారు. ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో విషయం పోలీసులకు చేరింది. అప్పటికే పరిస్థితి గమనించిన ఆసుపత్రి సిబ్బంది గేట్లు మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడైన డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మహిళకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే తరహాలో పలువురు మహిళలతో కూడా ఇలాంటి నేరానికే పాల్పడినట్టుగా చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని కోర్టు ఆదేశాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.