AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..

సోషల్ మీడియా అనేది ప్రస్తుతం ట్రెండింగ్ గా మారుతోంది. చేసే ప్రతి చిన్న పని అయినా.. అప్ లోడ్ చేస్తూ వైరల్ గా మారుతున్నారు. ట్యాలెంట్ ఉన్న వారికి ఇది ఒక మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. అంతే కాకుండా ఇంటర్నెట్ ను...

Trending Video: స్టేజ్ పైనే మరదలిని ఓ ఆటాడుకున్న వరుడు.. వీడియో చూస్తే పడీపడీ నవ్వాల్సిందే..
Bride Funny Video
Ganesh Mudavath
|

Updated on: Dec 31, 2022 | 9:05 AM

Share

సోషల్ మీడియా అనేది ప్రస్తుతం ట్రెండింగ్ గా మారుతోంది. చేసే ప్రతి చిన్న పని అయినా.. అప్ లోడ్ చేస్తూ వైరల్ గా మారుతున్నారు. ట్యాలెంట్ ఉన్న వారికి ఇది ఒక మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. అంతే కాకుండా ఇంటర్నెట్ ను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా భారతీయ వివాహానికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రజలు కూడా అలాంటి కంటెంట్‌ను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. బావ, మరదళ్లకు సంబంధించిన వీడియోలకు ఎక్కువ విజుబిలిటీ ఉంటే.. స్టేజ్ పై వధూవరులు చేసే వీడియోలు కూడా ఎక్కువ వ్యూస్ సంపాదిస్తుంటాయి. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉన్నాయి. మరి కొన్ని అయ్యో అనిపించేలా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. వరుడు వేదికపై కూర్చుని ఉంటాడు. అతనికి రసగుల్లా ఇచ్చేందుకు వధువు సోదరి..అక్కడి వస్తుంది. ఆమె అతనికి రసగుల్లా తినిపించే సమయంలో వరుడు చేసిన చిలిపి పని అక్కడున్న వారందిరినీ షాక్ కు గురిచేసింది. వధువు సోదరి.. వరుడికి తినిపిస్తుండగా వరుడు ఆమెను దగ్గరగా లాక్కొవడాన్ని చూడవచ్చు. అ తర్వాత ఏం జరగిందనేది వీడియోలో లేకపోయినా.. నెక్ట్స్ ఏంటనేది మనకు అర్థమవుతోంది. అంతే.. వరుడు చేసిన ఈ పనికి అక్కడున్న వారందరూ పడీ పడీ నవ్వారు. బావా మరదళ్ల సరసం అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు 1.5 లక్షల వ్యూస్, 6 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..