Viral Video: కొండ చిలువను అలా పట్టేశావేంట్రా బాబూ.. పిచ్చా లేక మొండి తనమా.. షాకింగ్ వీడియో.
ఎన్నో రకాల వీడియోలకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆనందాన్ని పంచితే మరికొన్ని విజ్ఙానాన్ని అందిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి. ఆ వీడియోలు చూస్తే గుండె జారినంత పని అవ్వకమానదు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు ఏం ధైర్యంరా బాబు..
ఎన్నో రకాల వీడియోలకు సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది. వీటిలో కొన్ని ఆనందాన్ని పంచితే మరికొన్ని విజ్ఙానాన్ని అందిస్తాయి. అయితే మరికొన్ని మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి. ఆ వీడియోలు చూస్తే గుండె జారినంత పని అవ్వకమానదు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు ఏం ధైర్యంరా బాబు అంటుంటే మరికొందరు మాత్రం పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా కుర్రాడు.? అతను చేసిన పనేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఎలా వచ్చిందో.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ భారీ కొండ చిలువు పెద్ద డ్రైనేజీలోకి వచ్చి చేరింది. పెద్ద ఎత్తున వాటర్ ఫ్లో ఉండడంతో ఆ కొండ చిలువకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో నీళ్లలోనే తిరుగుతూ ఉంది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన కొందరు యువకులు దానిని కాపడడానికి రంగంలోకి దిగారు. తాడు సహాయంతో దానిని బయటకు తీయాలని ఓ కుర్రాడు ప్రయత్నించాడు. అయితే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం, వేగంగా కదులుతుండడంతో పైథాన్ ఎంతకీ చిక్కలేదు.
देखी है कहीं ऐसी दिलेरी… #Trending #TrendingNow #viral pic.twitter.com/DRXExnNCyB
— Narendra Singh (@NarendraNeer007) December 30, 2022
దీంతో అక్కడే ఉన్న మరో కుర్రాడు వెంటనే రంగంలోకి దిగాడు. తాడుతో పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న కుర్రాడిని ఆపి మరీ చేతితో పామును పట్టేందుకు ప్రయత్నించాడు. కేవలం సెకండ్ల వ్యవధిలో కొండ చిలువ మెడను గట్టిగా చేతిలో బంధించేశాడు. అనంతరం నీటిలో నుంచి బయటకు తీసి పాముకు తాడును కట్టమని అవతలి వ్యక్తి చెప్పాడు. దీంతో ఆ కుర్రాడు పాముకు తాడు బిగించిన వెంటనే పామును అవతలికి పారేశాడు. దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. కొండ చిలువను చేతితో సులభంగా పట్టిన వ్యక్తికి ధైర్యమా లేదా పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..