Dry Cough: ఎడతెగని పొడి దగ్గుకు బెస్ట్ హోం రెమెడీస్.. ఇట్టే రిలాక్స్ అవుతారు..!
పొడి దగ్గును నయం చేయడంలో వంటింటి రెమెడీ ఎంతగానో సహాయపడుతుంది. జలుబు, దగ్గుకు మందుల కంటే ఇంటి నివారణలు ప్రభావవంతంగా ఉంటాయి.
చలికాలంలో జలుబు, దగ్గు సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా పొడి దగ్గు చాలా ప్రమాదకరం. ఇది గొంతులో తీవ్రమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. కొన్నిసార్లు గొంతులో దురద క్రమంగా పెరుగుతుంది. పొడి దగ్గును నయం చేయడంలో వంటింటి రెమెడీ ఎంతగానో సహాయపడుతుంది. జలుబు, దగ్గుకు మందుల కంటే ఇంటి నివారణలు ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
ఉప్పు, నీళ్లు.. గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలిస్తే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు కారణంగా గొంతులో తీవ్రమైన నొప్పి, చికాకు సమస్య ఉన్నప్పుడు, గోరువెచ్చని నీటితో పుక్కిలించడం వల్ల బ్యాక్టీరియాను తొలగించి, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.
పసుపు.. పసుపు దగ్గు నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. పొడి దగ్గుకు పసుపు పాలు తాగడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పసుపును కొద్దిగా వేడి చేసి అందులో తేనె కలపాలి.
నల్ల మిరియాలు.. నల్ల మిరియాలు దగ్గుకు చాలా మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు పొడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల మిరియాలు తేనె లేదా నల్ల ఉప్పుతో కలిపి తినవచ్చు.
తేనె.. తేనె దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మకాయలో తేనె కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి పాల టీలో తేనె కలిపి తాగితే పొడి దగ్గు తగ్గుతుంది.
వెల్లుల్లి.. వెల్లుల్లిలో చాలా పోషకాలు ఉన్నాయి. వెల్లుల్లి తింటే దగ్గు నయమవుతుంది. వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని పాలు, పసుపు కలిపి తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది.
అల్లం.. దగ్గుకు అల్లం మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. దగ్గుకు అల్లం కషాయం చాలా మేలు చేస్తుంది. ఇది గొంతు చికాకు, నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
మరిన్నిహెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.