AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love: ప్రేమను నిరాకరించిందని.. కన్నవారికి కడుపుకోత.. ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్..

ప్రేమించాడు.. ఆమె కాదనే సరికి తట్టుకోలేకపోయాడు.. తనకు దక్కదనే ఆలోచనను భరించలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమను కాదనుకుని యువతి ప్రేమే ముఖ్యమనుకున్నాడు....

Love: ప్రేమను నిరాకరించిందని.. కన్నవారికి కడుపుకోత.. ఫేస్ బుక్ లైవ్ లో సూసైడ్..
Crime News
Ganesh Mudavath
|

Updated on: Jan 02, 2023 | 1:16 PM

Share

ప్రేమించాడు.. ఆమె కాదనే సరికి తట్టుకోలేకపోయాడు.. తనకు దక్కదనే ఆలోచనను భరించలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమను కాదనుకుని యువతి ప్రేమే ముఖ్యమనుకున్నాడు. క్షణ కాలంలో కలిగిన ఆలోచనతో కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. ఈ విషాద ఘటన అస్సాంలో జరిగింది. అస్సాంలోని కలాయిన్‌ ప్రాంతానికి చెందిన జయ్‌దీప్‌.. మెడికల్‌ సేల్స్‌ ప్రొఫెషనల్‌గా పని చేస్తున్నాడు. సిల్చార్‌లో ఓ గది అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే జయ్ దీప్ ప్రేమను యువతి ఒప్పుకోలేదు. దీంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే.. తాను సూసైడ్ చేసుకుంటున్న సమయంలో జయ్ దీప్ ఫేస్ బుక్ లో లైవ్ పెట్టాడు. తాను ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నాడనే విషయాన్ని వివరించాడు. తాను ఆమెను ఎంతగానో ప్రేమించానని.. అదే విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్‌ చేస్తే అందరిముందు తిరస్కరించిందని వాపోయాడు. ఈ విషయం వాళ్ల ఇంట్లో వాళ్లకు తెలిసిందని.. తనతో కలిసి ఉంటే యువతిని చంపేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మానాన్నల కంటే ఎక్కువగా ఆ యువతిని ప్రేమించానని, కానీ.. ఆమె కాదనేసరికి తట్టుకోలేక ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు కన్నీటిపర్యంతమయ్యాడు. అమ్మానాన్న నన్ను క్షమించాలని వేడుకున్నాడు.

విషయం తెలుసుకున్న జయ్‌దీప్‌.. కుటుంబసభ్యులు ఊహించని హఠాత్పరిణామానికి షాక్ అయ్యారు. యువతి కుటుంబసభ్యుల ఒత్తిడితోనే తన సోదరుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు.. బాధితుడి కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసు అధికారి నుమల్‌ మహంతా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!