AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మరో అడుగు !

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ గుడికి సంబంధించిన మ్యాప్ ను అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీకి సమర్పించింది. దీన్ని ఈ అథారిటీ త్వరలో..

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మరో అడుగు !
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 29, 2020 | 8:57 PM

Share

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ గుడికి సంబంధించిన మ్యాప్ ను అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీకి సమర్పించింది. దీన్ని ఈ అథారిటీ త్వరలో ఆమోదించవలసి ఉంది. ఈ మ్యాప్ తో బాటు ఇతర డాక్యుమెంట్లను కూడా ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా  ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ అనిల్ మిశ్రా..మాట్లాడుతూ.. తమ డాక్యుమెంట్లను ఈ సంస్థ రేపో మాపో ఆమోదిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఆలయ నిర్మాణానికి దేశ వ్యాప్తంగా భక్తుల నుంచి విరాళాలు అందుతున్నట్టు ఆయన చెప్పారు.