ఇదీ… నివేదా థామస్ నివేదన

బాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ తన డైరెక్షన్ డ్రీంని రివీల్ చేసింది. ప్రస్తుతం యాక్టింగ్ లో ఉన్నాకాని.. ఎప్పటికైనా డైరక్టర్ అవుతానంటోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా..

ఇదీ... నివేదా థామస్ నివేదన
Pardhasaradhi Peri

|

Aug 29, 2020 | 8:33 PM

బాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ తన డైరెక్షన్ డ్రీంని రివీల్ చేసింది. ప్రస్తుతం యాక్టింగ్ లో ఉన్నాకాని.. ఎప్పటికైనా డైరక్టర్ అవుతానంటోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకుంది. వెంటనే మూవీ డైరక్షన్ లోకి దిగకుండా ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ చేసి తర్వాత దర్శకురాలిగా టర్న్ తీసుకుంటానంటోంది. దీనికి సంబంధించి నానితో ఎక్కువ డిస్కస్ చేస్తానని కూడా చెప్పింది. నాని తనకు మంచి ఫ్రెండ్‌ అని.. అనేక విషయాలపై తాము చర్చించుకుంటామని తెలిపింది. ప్రస్తుతం 3 సినిమా ఆఫర్లు స్టోరీస్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నాయని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పింది. ఓటీటీలో నటించాలని ఉందని చెప్పుకొచ్చిందీ చిన్నది. నాని, సుధీర్ బాబు, ఆదితిరావు హైద‌రిల‌తో క‌లిసి నటిస్తోన్న సినిమా ‘వి’ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న విడుద‌ల కానున్న నేపథ్యంలో నివేదా ఇలా నివేదించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu