దోపిడి దొంగల దాడిలో క్రికెటర్ సురేష్ రైనా బంధువు మృతి
క్రికెటర్ సురేష్ రైనా బంధువైన 58 ఏళ్ళ అశోక్ కుమార్ అనే వ్యక్తిని దోపిడీ దొంగలు హతమార్చారు. వారి దాడిలో ఈయన కుటుంబంలోని మరో నలుగురు గాయపడ్డారు. పంజాబ్లోని పఠాన్ కోట్ వద్ద గల..

క్రికెటర్ సురేష్ రైనా బంధువైన 58 ఏళ్ళ అశోక్ కుమార్ అనే వ్యక్తిని దోపిడీ దొంగలు హతమార్చారు. వారి దాడిలో ఈయన కుటుంబంలోని మరో నలుగురు గాయపడ్డారు. పంజాబ్లోని పఠాన్ కోట్ వద్ద గల గ్రామంలో ఈ నెల 19 న ఈ ఘటన జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. అశోక్ కుమార్ ప్రభుత్వ కాంట్రాక్టర్ అని తెలిసింది. వీరి ఇంటిని దోచుకోవడానికి వఛ్చిన దొంగలు ఇంటి పై భాగంలో నిద్రిస్తున్న అశోక్ కుమార్ ని ఆయన తల్లిని, భార్యను, ఇద్దరు కుమారులను తీవ్రంగా గాయపరిచారని తెలియవచ్చింది. ఈ ఎటాక్ లో అశోక్ కుమార్ మరణించారు. దీనిపై సురేష్ రైనా స్పందన తెలియలేదు.




