ఉదయం రాఖీ కట్టించుకున్నాడు.. రాత్రి ఆత్యాచారం చేసి హత్య చేశాడు.. ఎలా దొరికాడంటే!
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాఖీ కట్టిన చెల్లి వరుసైన బాలికపై కన్నేసిన ఒక కామాందుడు.. రాత్రి నిద్రిస్తున్న సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా బాలిక మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్టు క్రియేట్ చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ వ్యక్తి రాఖీ కట్టిన చెల్లి వరుసైన బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 33 ఏళ్ల సుర్జీత్ అనే వ్యక్తి శనివారం రక్షా బంధన్ సందర్భంగా తన బంధువు ఇంటికి వెళ్లాడు. అక్కడ తన సోదరివరుసైన 14 ఏళ్ల బాలికతో రాఖీ కట్టించుకున్నాడు. అయితే ఆరోజు రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన సుర్జీత్.. మద్యం మత్తులో ఇంటికి చేరుకున్నాడు. రూమ్‌లో ఒంటరిగా పడుకున్న బాలికపై కన్నేశాడు. ఇంకేముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను హత్య చేశాడు.
తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు. బాలిక ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించాలనుకున్నాడు. తాడు సహాయంతో బాలిక మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు వేలాడతీశాడు. తర్వాత ఎవరికీ చెప్పా పెట్టకుండా అన్నడి నుంచి తన స్వగ్రామానికి పారిపోయాడు. అయితే పక్కగదిలో పడుకున్న తండ్రి ఉదయం బాలికను లేపేందుకు వెళ్లగా.. ఆమె ఫ్యాన్ వేలాడుతూ కనిపించింది. అది చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
కాసేపటికి తేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక శరీరంపై రక్తపు మరకలు ఉండటాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ అక్కడికి చేరుకున్న సుర్జిత్ పోలీసుల ప్రశ్నలతకు తాను సమాధానం చెబుతూ వారి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక మృతదేమాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
అయితే బాలిక పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను ఎవరో అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్‌మార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో సుర్జీత్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు… అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ నేరం తానే చేసినట్టు సుర్జిత్ అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




