రజనీకాంత్ పొలిటికల్ పార్టీ : ఎన్నికల్లో విజయం సిద్ధించాలని అరుణాచలేశ్వరునికి రజనీ కుటుంబసభ్యుల ప్రత్యేక పూజలు
తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖరారైపోవడంతో పార్టీ ఏర్పాటు సవ్యంగా సాగేందుకు రజని కుటుంబసభ్యులు ప్రత్యేక యాగాలు,..
తమిళ సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ పెట్టడం ఖరారైపోవడంతో పార్టీ ఏర్పాటు సవ్యంగా సాగేందుకు రజని కుటుంబసభ్యులు ప్రత్యేక యాగాలు, పూజలు మొదలుపెట్టారు. అగ్నిస్థలమైన తమిళనాడులోని అరుణాచలేశ్వరునికి రజనీకాంత్ గొప్ప భక్తుడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రజిని సోదరుడు సత్యనారాయణ తిరువణ్ణామలై ఆలయంలో ఇవాళ ప్రత్యేక యాగం నిర్వహించారు. త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్న రజినీకి ఎన్నికలలో విజయం చేకూరాలని ప్రత్యేక పూజలు చేశారాయన. డిసెంబర్ 12 న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా, అభిమానులు తమిళనాడులో ఇప్పటికే పలు చోట్ల పూజలు, యాగాలు కూడా మొదలుపెట్టారు. తమిళ రాజకీయాలలో రజినీ మార్క్ తప్పక కనబడుతుందని అభిమానుల ధీమాగా ఉన్నారు.