పీఎం వాణి… త్వరలో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు.. కామన్ మెన్‌కు అందుబాటులోకి… టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్

దేశంలో వైఫై సేవలు త్వరలో అందరికి అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పీఎం వాణి... త్వరలో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు.. కామన్ మెన్‌కు అందుబాటులోకి... టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2020 | 4:59 PM

You’ll get high-speed net via app as govt clears national Wi-Fi grid దేశంలో వైఫై సేవలు త్వరలో అందరికి అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దానికి ‘పీఎం–వాణి’ పేరు పెట్టింది. ఈ విధానం పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ), పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్‌ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో అందుబాటులోకి రానుంది. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయని కేబినెట్‌ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు తెలిపారు.

సేవలు అందుబాటులోకి ఇలా…

వైఫై యాక్సెస్‌ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్‌స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ… పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్‌ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్‌ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి, డిస్‌ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్‌ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్‌ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్‌ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్‌ డెవలపర్లు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!