సీజేఐ జస్టిస్ బాబ్డే తల్లికి రూ.2.5 కోట్ల టోకరా, నిందితుడిని అరెస్ట్ చేసిన నాగపూర్ పోలీసులు

సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే తల్లినే మోసగించాడో ప్రబుధ్ధుడు. ఆమెకు రూ. 2.5 కోట్ల మేర టోకరా వేశాడు. తపస్ ఘోష్ అనే 49 ఏళ్ళ ఈ ఛీటర్ ను నాగపూర్ పోలీసులు..

సీజేఐ జస్టిస్ బాబ్డే తల్లికి రూ.2.5 కోట్ల టోకరా, నిందితుడిని అరెస్ట్ చేసిన నాగపూర్ పోలీసులు
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 5:14 PM

సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బాబ్డే తల్లినే మోసగించాడో ప్రబుధ్ధుడు. ఆమెకు రూ. 2.5 కోట్ల మేర టోకరా వేశాడు. తపస్ ఘోష్ అనే 49 ఏళ్ళ ఈ ఛీటర్ ను నాగపూర్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇతడి యవ్వారంపై దర్యాప్తునకు ‘సిట్’ కూడా ఏర్పాటైంది. ఈ మోసానికి సంబంధించి పోలీసులు వివరిస్తూ..బాబ్డే కుటుంబానికి ఆయన నివాసానికి దగ్గరే ‘ సీజన్స్ లాన్ ‘పేరిట ఓ ప్రాపర్టీ ఉందని, దీనికి బాబ్డే తల్లి ముక్తా బాబ్డే యజమానురాలని తెలిపారు. ఈ భవనానికి కేర్ టేకర్ గా తపస్ ఘోష్ ని సీజేఐ కుటుంబం నియమించుకుందన్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఈ భవనాన్ని అద్దెకు ఇచ్ఛేవారని, అయితే ముక్తా వయసు మీరడాన్ని, ఆమె అనారోగ్యాన్ని అలుసుగా తీసుకుని ఘోష్, అతని భార్య రసీదులను ఫోర్జరీ చేసి ఇంత భారీ మొత్తాన్ని కాజేశారన్నారు. ఘోష్ 10 ఏళ్లుగా ఈ భవనానికి కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్నట్టు తెలిసిందన్నారు. బహుశా ఇంకా ఎక్కువే ఈ కపుల్ మోసగించి ఉండవచ్ఛునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘోష్ ని వారు కోర్టులో హాజరు పరిచారు.