కరోనా ఫైట్.. ఎన్ని దేశాలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయో తెలుసా. అవి ఏ దశ ప్రయోగాల్లో ఉన్నాయో తెలుసా…

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్ వంటి దేశాలు కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయి.

కరోనా ఫైట్.. ఎన్ని దేశాలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయో తెలుసా. అవి ఏ దశ ప్రయోగాల్లో ఉన్నాయో తెలుసా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 10, 2020 | 4:29 PM

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్ వంటి దేశాలు కరోనా నివారణకు వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్నాయి. అయితే కరోనాపై ఫైట్ చేస్తున్న ప్రపంచ దేశాలు వారి వారి ప్రయత్నాల్లో ఎక్కడి వరకు చేరుకున్నారో చూద్దామా…

1. స్పుత్నిక్-వి – రష్యా

రష్యా ప్రభుత్వం తన తయారు చేసిన వ్యాక్సిన్‌కు స్పుత్నిక్ వీ అని పేరు పెట్టింది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఈ వ్యాక్సిన్‌ భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. అయితే స్పుత్నిక్ వి టీకా నిర్వాహణ, పంపిణీ కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.

2. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (కోవిషీల్డ్) – బ్రిటన్

బ్రిటన్ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌కు ఆస్ట్రాజెనెకా అని పేరు పెట్టింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. భారత దేశంలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్ బ‌ృందంతో ఒప్పందకుని దేశీయంగా పుణేలో వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా సైతం ట్రయల్స్ దశలో ఉంది.

3. సినోఫార్మ్ వ్యాక్సిన్ -చైనా

చైనా దేశం కరోనా నియంత్రణకు సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుంది. చైనా వ్యాక్సిన్ 86 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందతీ యుఏఈ వైద్యశాఖ తెలిపింది.

4. మోడెర్నా వ్యాక్సీన్ – అమెరికా

అగ్రరాజ్యం అమెరికా కరోనాపై పోరుకు మోడెర్నా టీకాను రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ టీకా ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. ఈ టీకాను మైనస్ 20 డిగ్రీల నిల్వ ఉంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

5. ఫైజర్ వ్యాక్సీన్ – అమెరికా, జర్మనీ

జర్మనీ, అమెరికా కలిసి సంయుక్తంగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి. అయితే అల్ట్రా కోల్డ్ స్టోరేజ్ పద్ధతిలో మైనస్ 75 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ధ నిల్వ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కాగా బయో ఫార్మా బయో ఎన్టెక్ కంపెనీ ఫైజర్ తయారీ కోసం ఒప్పందం చేసుకుంది.

6. కొవాగ్జిన్-భారత్

భారత దేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకాను తయారు చేస్తోంది. ఐసీఎంఆర్‌తో కలిసి టీకాను రూపొందించడంలో భారత్ బయోటెక్ తో కలిసి పని చేస్తోంది. ఈ టీకాను హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్నారు. కాగా, క్లినికల్ ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి.

7. జైకోవ్-డి, భారత్

భారత దేశానికి చెందిన క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ జైకోవ్ డి టీకా ను అహ్మదాబాద్ కేంద్రంగా తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ టీకా ట్రయల్స్ మూడో దశలో ఉన్నాయి.

మరిన్ని వివరాలు…

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సంస్థల సంఖ్య 34 ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రూపొందించి ప్రీ క్లినికల్ ట్రయల్స్ వరకు చేరుకున్న కంపెనీలు 142 ప్రపంచ వ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ 3 దశలో ఉన్నాయి.

డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి