Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిహార్ అయిపోయింది.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కుల గణన సర్వే

రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా కుల గణన సర్వే నిర్వహించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి మంత్రి మండలి ఆమోదం కూడా లభించిన అనంతరం ఇందుకు సంబంధించిన ఆదేశాలను సామాజిక న్యాయం, సాధికారక శాఖ విడుదల చేసింది. ఇప్పటికే బిహార్ కుల గణన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బిహార్ తర్వాత కుల గణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది.

బిహార్ అయిపోయింది.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కుల గణన సర్వే
Caste Survey
Aravind B
|

Updated on: Oct 08, 2023 | 2:58 PM

Share

రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా కుల గణన సర్వే నిర్వహించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి మంత్రి మండలి ఆమోదం కూడా లభించిన అనంతరం ఇందుకు సంబంధించిన ఆదేశాలను సామాజిక న్యాయం, సాధికారక శాఖ విడుదల చేసింది. ఇప్పటికే బిహార్ కుల గణన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బిహార్ తర్వాత కుల గణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతేకాదు తమ సొంత వనరులతోనే ఈ కుల గణన సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులో తెలిపింది.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని కులాల వారీగా జనాభా లెక్కలు రూపొందించడమే తమ ప్రధాన ఎన్నికల ఎజెండా అవుతుందని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్‌ ఎన్నికల కోసం పార్టీలోని అభ్యర్థులను ఖరారు చేసేందుకు ‘కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ’ శనివారం రోజున ఢిల్లీలో సమాలోచనలు జరిపింది. అయితే ఏ అంశంపై ఎన్నికలకు వెళ్లాలనే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ ఈ భేటీకి హాజరయ్యారు. సాధారణంగా పీసీసీకి సారథిగా ఉన్న వ్యక్తే పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా పేర్కొన్నారు.

ఇటీవలే బిహార్ ప్రభుత్వం కుల జనగణన వివరాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా లెక్కల ప్రకారం చూసుకుంటే.. రాష్ట్ర జనాభా 13 కోట్లుగా ఉంది. అయితే ఇందులో ఓబీసీలు 27.12 శాతం, ఈబీసీలు 36.01 శాతం, షెడ్యూల్డ్ కులాల వారు 19.65 శాతం, షెడ్యూల్డ్ తెగవారు 1.68 శాతం ఉన్నారు. అయితే జనాభాలో అగ్రవర్ణాలుగా చెప్పేవారి సంఖ్య 15.52 శాతంగా ఉంది. ఇక ఓబీసీలు, ఈబీసీలు కలుపుకుంటే మొత్తం బీసీలు 63.13 శాతంగా ఉన్నారు. మరోవైపు నితిష్ కుమార్ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టడంపై బీజేపీ తీవ్ర ఆరోపణను చేసింది. రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టించడానికే ఈ లెక్కల్ని విడుదల చేశారని బీజేపీ విమర్శించింది. వాస్తవానికి 1931 వరకు ఇండియాలో కులాల వారీగా జనాభా లెక్కల్ని సేకరించారు. ఆ తర్వాత 1941లో కూడా సేకరించినా ప్రచురించలేదు. ఇక 1951 నుంచి 2011 దాకా జనాభా లెక్కల సేకరణలో ప్రతిసారి ఎస్సీ, ఎస్టీ డేటా సేకరించి ప్రచూరిస్తున్నారు. అయితే ఓబీసీ, ఇతర కులాలకు సంబంధించిన డేటాలను బయటపెట్టడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..