Hydrogen Trains: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్.. త్వరలో హైడ్రోజన్ రైళ్లు
Indian Railways: నూతన విధానాలతో భారత రైల్వే దూసుకుపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సంస్కరణలకు నాంది పలికిన భారత రైల్వే మరో ఆవిష్కరణల
Indian Railways: నూతన విధానాలతో భారత రైల్వే దూసుకుపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సంస్కరణలకు నాంది పలికిన భారత రైల్వే మరో ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తోంది. ఇకపై దేశంలో సీఎన్జీతోనే కాకుండా హైడ్రోజన్ ఇంధనంతో కూడా రైళ్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో ఈ ప్రయోగం విజయవంతమయినట్లు భారత రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. హైడ్రోజన్ ఇంధనంతో జర్మనీ, పోలాండ్‌లలో ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో భారత్‌లోనూ ఈ ఇంధనంతో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇందుకోసం రైల్వే విభాగం డీజిల్ ఇంజిన్లను రెక్ట్రోఫిట్టింగ్ చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ ఆధారిత టెక్నిక్‌ను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ముందుగా రెండు డెమో ర్యాక్‌లను హైడ్రో ఇంజిన్లుగా మార్చి ప్రయోగాలు చేపట్టనున్నారు. డీజిల్ రైళ్లకు హైడ్రోజన్‌ను ఉపయోగించి నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్‌లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు బిడ్స్‌ను సైతం ఆహ్వానించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
డీజిల్ రైళ్లకు హైడ్రోజన్‌ను ఉపయోగించి నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో ముందుగా పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డీజిల్ రైలును హైడ్రోజన్ ట్రైన్‌గా మార్చటం ద్వారా సంవత్సారానికి 2.3 కోట్ల ఖర్చు అదా చేయటంతోపాటు కార్బన్ ఉద్ఘారాలను తగ్గించి కాలుష్యాన్ని నివారించే అవకాశం ఉంటుందని రైల్వే తెలిపింది. దీంతోపాటు ఈ హైడ్రోజన్ రైల్లు బుల్లెట్ తరహాలో వేగంగా దూసుకెళ్లనున్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ బిడ్డింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 5న ముగుస్తుంది.
హైడ్రోజన్ ఇంధనం, సౌరశక్తి నుండి నీటిని ఎలెక్ట్రోలైజింగ్ చేయటం ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. కావున ఈ ప్రక్రియ హరిత వంతమైన రైల్వే రవాణాకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంటున్నారు.
Also Read: